PM Modi: 2024 ఎన్నికల లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిన ఒకవేళ మెజార్టీ స్థానాలు దిగజారితే వాటిని దక్షిణాదిన కవర్ చేసుకోవాలని మోడీ అంట్ టీం ఆలోచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎలాగైనా ఇక్కడ రాజకీయంగా ఎదగాలని భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పీఎం మోడీ ఢిల్లీలోని తన నివాసంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు కన్నడ ఎంపీలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలను, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
నార్త్ టు సౌత్ పాలిటిక్స్ వైపు..
బీజేపీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే అది ఉత్తరాది రాష్ట్రాల వల్లే.. ఉత్తరాదిన బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ దక్షిణాదిన బీజేపీ అంతగా విస్తరించలేకపోయింది. కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఒకప్పడు దక్షిణాదిలో బలంగా ఉండేది. ఇప్పటికీ హస్తం పార్టీకి కేడర్ గట్టిగానే ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలు వేసే ఎత్తులకు జాతీయ కాంగ్రెస్ వరుసగా చిత్తవుతోంది. కారణం ఆ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు లేకపోవడమే.. హస్తినలో కూడా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చే నాయకుడు కనిపించడం లేదు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.దీంతో అధక్ష పదవికి రాజీనామా చేశాడు. నాటి నుంచి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సౌత్ లో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టింది.
ఏపీ అండ్ తెలంగాణపైనే ఫోకస్
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ ఏపీ మరియు తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో సమావేశం నిర్వహించడం, వారికి దిశానిర్దేశం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాగైనా అధికార పార్టీలను ఢీ కొడుతూ తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్, ఏపీలో టీడీపీని దాటేయాలని బీజేపీ మేజర్ ప్లాన్‌గా అర్థమవుతోంది. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా ఎంపీ స్థానాలున్నాయి. దీంతో బీజేపీ అక్కడ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. జనసేనతో పొత్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అందుకే ఈ నెల 28న విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. దానికి కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
Also Read: Vijay Diwas: విజయ్ దివస్-1971 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు.. ఆరోజు ఏం జరిగిందంటే..?
ఈ అవకాశాన్ని ఏవిధంగా అయినా అందిపుచ్చుకోవాలని మోడీ ఎంపీలకు సూచించారు. అందుకు కావాలసిన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం తరఫున అంజేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతానికి నియోజకవర్గ స్థాయి నుంచి కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.ఇక తెలంగాణలోనూ దూకుడుగా వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మంచి ఎదుగుదలను కనబరిచింది. ఇలానే ముందు సాగి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోడీ ఏంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సూచించినట్టు తెలిసింది.
Also Read: Virat Kohli vs BCCI: టీమిండియాలో ముసలం.. కోహ్లీ వదులుకోలేదు.. తొలిగించారన్న మాట
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Pm modi focused on telugu states 2024 election is the target
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com