Modi Telugu States: తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మంటపెట్టిన మోడీ

Modi Telugu States: కాంగ్రెస్ ను బూచీగా చూపేందుకు తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మోడీ సార్ మంట పెట్టేశారు. విభజన గాయాలు రేపి మరీ రెచ్చగొట్టేశారు. కాంగ్రెస్ ను విలన్లుగా చూపించేందుకు ఉమ్మడి ఏపీ విభజననే సాకుగా చూపెట్టారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోడీ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. ఒకటి […]

Written By: NARESH, Updated On : February 8, 2022 2:35 pm
Follow us on

Modi Telugu States: కాంగ్రెస్ ను బూచీగా చూపేందుకు తెలుగు రాష్ట్రాలను వాడుకొని మళ్లీ మోడీ సార్ మంట పెట్టేశారు. విభజన గాయాలు రేపి మరీ రెచ్చగొట్టేశారు. కాంగ్రెస్ ను విలన్లుగా చూపించేందుకు ఉమ్మడి ఏపీ విభజననే సాకుగా చూపెట్టారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రధాని మోడీ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. ఒకటి సాగుచట్టాల రద్దుతోపాటు కర్ణాటకలో పుట్టుకొచ్చిన ‘హిజాబ్’ వివాదాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే డైవర్ట్ పాలిటిక్స్ దిశగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మోడీ ఎండగట్టే ప్లాన్ చేశారు. నిన్న పార్లమెంట్ లో తెలంగాణను ఏర్పాటు చేసినా అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించలేదని.. అంతటి విశ్వసనీయత లేని పార్టీ కాంగ్రెస్ అంటూ తెలంగాణను వాడేశారు.

ఇప్పుడు మోడీ ఏపీని వాడేశారు. ఏపీ విభజన అంశాన్ని వాడుకొని కాంగ్రెస్ ను కడిగిపారేశారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటుపై కూడా నోరు జారలేదు. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారసు. వాజ్ పేయి ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని.. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చొని చర్చించి ఆ రాష్ట్రాల విబజన ఏర్పాటు బిల్లులను పాస్ చేశామని చెప్పుకొచ్చారు.

కానీ కాంగ్రెస్ చేసిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అలా జరగలేదని మోడీ కార్నర్ చేశారు. కాంగ్రెస్ హయాంలో సభలో మైకులు ఆపేసి.. పెప్పర్ స్ప్రే కొట్టారని.. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారని మోడీ ఇరుకునపెట్టారు.

ఇక మోడీ తీరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకు అన్యాయమైపోయినట్టుగా ఉంది. విభజనతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోయాయని అనడం గమనార్హం. కాంగ్రెస్ అహంకారం.. అధికార కాంక్షకు ఇదే నిదర్శనం అని తెలుగు రాష్ట్రాల విభజనను మోడీ పార్లమెంట్ లో బాగా వాడుకున్నాడు.