Heeraben Modi 100th Birthday: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తల్లి జన్మదినం సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ప్రస్తుతం వంద సంవత్సరాలు నిండటంతో శతాధిక వృద్ధురాలుగా రికార్డు సాధించింది. దీంతో ప్రధాని ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లు తన కళ్లకు అద్దుకుని పాదాభివందనం చేశారు. తల్లిపై ఉన్న మమకారంతో ఆయన తల్లికి సేవ చేసి ఇంకా మరిన్ని సంవత్సరాలు బతకాలని ఆకాంక్షించారు పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో తన తల్లి జీవించాలని కోరుకున్నారు. దీంతో మోడీ ఆమె తల్లికి చేసిన సేవలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా పావగడ్ లోని కాళికా మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. గత 500 సంవత్సరాలుగా అక్కడ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం లేదు. పావగడ్ దేవాలయం పర్వతం మీద ఉంది. అక్కడికి వెళ్లాలంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రధాని ప్రత్యేక పూజలు చేయించేందుకు వెళ్లనుండటంతో ఏర్పాట్లు చేశారు. మోడీ తన తల్లి జన్మదినం సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. తన తల్లి కాళ్లు కడిగి కళ్లకు అద్దుకోవడం సంచలనం కలిగిస్తోంది. తల్లిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేయడం వైరల్ గా మారింది.
Also Read: Vizianagaram TDP: విజయనగరం టీడీపీలో వర్గపోరు.. అధినేత ఎదుటే బలప్రదర్శన
పడోదరలో ప్రధాని మోడీ రెండు పథకాలను ప్రకటించనున్నారు. మాతృశక్తి యోజన, పోషణ్ సుధా యోజన పథకాలను ప్రకటించి గుజరాత్ వాసులకు తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, శిశువుల సంర్షణే ప్రధానంగా ఈ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దీంతో ప్రధాని మోడీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు పర్యటించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ గుజరాత్ పై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ మళ్లీ పాగా వేయాలని చూస్తోంది. దీనికి గాను మోడీ పలు జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారు. సొంత రాష్ట్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రతిష్ట నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీలు తమ బలాబలాలపై కసరత్తు మొదలు పెట్టాయి.మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Also Read:YSRCP Plenary Meeting: ప్లీనరీ వేదికగా జగన్ కీలక ప్రకటనలు? ఇక విపక్షాల ఆట కట్టేనా?