YCP Govt: అధికారంలో ఉండగా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాలు చాలా తక్కువ. అధికారం కోల్పోయే చివరి ఆరునెలల్లో మాత్రమే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది బయటపడుతుంది. ప్రజల్లోకి వెళితే నిలదీస్తారు. ఆ నేతలను ముట్టడించి ఆగమాగం చేస్తారు. కానీ ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అధికార వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా దాడి చేస్తున్న మంత్రులకు ప్రజల నుంచి .. కార్యకర్తల నుంచి సెగ తగులుతోంది.

తాజాగా ఏపీ మంత్రి కన్నబాబుకు ప్రజల నుంచి గట్టి షాక్ తగిలింది. ఏకంగా ప్రజలు చుట్టు ముట్టి కన్నబాబును తరిమికొట్టిన వైనం విస్తుగొలుపుతోంది. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న కన్నబాబు కారును చుట్టుముట్టిన ప్రజలు చెప్పులు, దుమ్మెత్తిపోస్తూ ఆయన కారును ముట్టడించి నిలదీతలు మొదలుపెట్టారు. పోలీసులు అతి కష్టం మీద ఆ జనసమూహం నుంచి ఆయనను తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎలాగోలా తప్పించుకున్న కన్నబాబు కారులో వెళ్లిపోయారు.
ఏపీలో అధికార వైసీపీ మంత్రులు, నేతల తీరుపై జనాలు భగ్గుమంటున్నారనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.. సంక్షేమం పేరుతో పంచి పెట్టడం.. అభివృద్ధి చేయకపోవడం.. నిలదీస్తున్న జనసేన, టీడీపీ నేతలపై దాడులతో రెచ్చిపోవడం.. పవన్,చంద్రబాబులను కించపరిచేలా మాట్లాడడం.. ఇలా వైసీపీ పాలన ఇంకా రెండేళ్లు ఉండగానే జనాలకు చిర్రెత్తుకొస్తోంది. కొందరు కార్యకర్తలు మంత్రులు కనపడితే చాలు గుమిగూడి గో బ్యాక్ అంటూ నిలదీస్తున్న పరిస్థితి.
మంత్రి కన్నబాబును అయితే ప్రజలు చుట్టుముట్టి మరీ తరిమికొట్టాడం చూస్తుంటే జగన్ చాప్టర్ క్లోజ్ అని.. ఆయన పరిపాలనకు ఇదే చివరి రోజులు అని అర్థమవుతోంది. ఇంతటి వ్యతిరేకత పాలనలో ఉండి ఎదుర్కొంటున్నది జగన్ సర్కారేనని అందరూ అభిప్రాయపడుతున్నారు.