Anchor Pradeep- Rashmi Gautam: బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నారు యూనిట్. తాజాగా రష్మీ చేసిన పనికి పక్కనే ఉన్న యాంకర్ ప్రదీప్ అసహ్యించుకున్నాడు. రష్మీ-నందు జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4న విడుదల అవుతుంది. దీంతో ప్రమోషన్స్ కోసం మాల్స్ లో పోస్టర్స్ ఏర్పాటు చేశారు. ఒక మాల్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ పోస్టర్ ఉంది. ఆ పోస్టర్లో నందు, రష్మీ రొమాంటిక్ ఫోజులో ఉన్నారు. రష్మీ వెనకున్న నందు ఆమె జాకెట్ ముడి లాగుతున్నాడు. ఈ పోస్టర్ వద్దకు వెళ్లిన రష్మీ… పోస్టర్ లో ఉన్న ఆమె ఫోటో వీపు నిమురుతూ అబ్బా రష్మీ… అంటూ ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రదీప్, ఛీ ఛీ అంటూ అసహ్యించుకున్నాడు.

ఈ వీడియో రష్మీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. మూవీ ప్రమోషన్ కోసం రష్మీ ఇలాంటి వీడియో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. బొమ్మ బ్లాక్ బస్టర్ దాదాపు రెండేళ్లుగా బాక్సుల్లో నలిగిపోయింది. ఇక విడుదల కష్టమే అనుకుంటున్న తరుణంలో మేకర్స్ వ్యయప్రయాసలకోర్చి థియేటర్స్ లోకి తెస్తున్నారు. ఆశలు వదులుకున్న మూవీ థియేటర్స్ లోకి రావడంతో హీరో నందు ఆనందానికి హద్దులు లేవు. సినిమాకు మంచి ప్రచారం కల్పించి ఓపెనింగ్స్ రాబట్టాలని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు.
రష్మీని ఆటోలో ఎక్కించుకొని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ మైకులో ప్రచారం చేశాడు. వీరితో రాకేష్ మాస్టర్ జాయిన్ అయ్యాడు. ఏసీ కార్లలో తిరిగే రష్మీ ఆటోలో తిరగలేక ఇబ్బంది పడింది. ఎండా, గాలి, ధూళికి తట్టుకోలేక ఇక నా వల్ల కాదు అంటూ హీరో నందుని వేడుకుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ యూనిట్ ఆటోరిక్షా ప్రచారం గట్టిగానే వర్క్ అవుట్ అయ్యింది. జనాలు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. రష్మీ పబ్లిక్ లోకి రావాడంతో చూసేందుకు జనాలు ఎగబడ్డారు. హీరోగా ఎదగాలని నందు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని తపనపడుతున్నాడు.

2006లో విడుదలైన ‘ఫోటో’ మూవీతో నందు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఒకటి రెండు చిన్న చిత్రాల్లో హీరోగా చేశాడు. సుకుమార్-నాగ చైతన్యల బ్లాక్ బస్టర్ 100% లవ్ మూవీలో కీలక రోల్ చేశాడు. స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా, స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తూ కెరీర్ నెట్టుకొచ్చాడు. 2020లో సవారీ టైటిల్ తో ఓ డిఫరెంట్ మూవీ చేశాడు. అది కూడా ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు. రెండేళ్లకు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో హీరోగా మళ్ళీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. సింగర్ గీతా మాధురిని నందు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram