Silver : భారతదేశంలో బంగారం లోహానికి చాలా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది మహిళలు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటాయి. అయితే బంగారం కొనలేని వారు ఆ తర్వాత వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు. వెండితో కూడా వివిధ ఆభరణాలు చేసుకుని మహిళలు ధరిస్తూ ఉంటారు. బంగారం తర్వాత వెండికి మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా మహిళలు లేదా పురుషులు బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. కానీ కొందరు వెండి ఆభరణాలు కూడా చేతికి వేసుకుంటూ ఉంటారు. మహిళలు అయితే కాళ్లకు పట్టీలు లేదా కడాలు వెండితో కూడినవి ధరిస్తారు. పురుషులు చేతికి ఆభరణం లేదా వేలికి ఉంగరం వంటివి ధరిస్తారు. అయితే కొన్ని రాశుల ప్రకారం కొందరు వెండి ఆభరణాలు అస్సలు ధరించకూడదు. ఆ రాశులు ఏవంటే?
Also Read : రాబోయే కాలంలో వెండే కీలకం.. బిజినెస్ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి ఆభరణాలు ధరించడం వల్ల శుక్రుడు, చంద్రుడు అనుగ్రహంగా ఉంటాడు. వెండి ఆభరణాలు ధరించిన వారు వారి ఇంట్లో శాంతి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ వెండి ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడరు. కానీ కొందరు రాశులు వారి జాతకరీత్యా వెండి ఆభరణాలను ధరించడం వల్ల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారు వెండి ఆభరణాలను ధరించడం మంచిది. వృషభం, తులా రాశి వారు కూడా వెండి ఆభరణాలను ధరించడం వల్ల కలిసి వస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో వీరికి ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ రాశుల వారు వెండి ఆభరణాలు ధరించాలి అనుకుంటే పురుషులు కుడి చేతి బొటన వేలుకు ఉంగరం వేసుకోవాలి. ఆడవారు అయితే ఎడమ చేతి బొటనవేలుకు ఉంగరం వేసుకోవాలి. అలా చేయడంవల్ల అనుకూలమైన వాతావరణముండి సంతోషకరమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా మీరు రాసిన వారు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వెండి ఉంగరం ధరించాలని అనుకునేవారు సోమవారం లేదా శుక్రవారం నాడు ధరించడం వల్ల శుక్ర గ్రహ అనుగ్రహం కలుగుతుంది. అయితే పొరపాటున శనివారం వెండి ఆభరణాలను అసలు ధరించకూడదు.
Also Read : ఈ గ్లాసు ఖరీదు ఎక్కువే.. కానీ నీరు తాగితే బోలెడన్నీ ప్రయోజనాలా?
అయితే వెండి ఆభరణాలు కొన్ని రాజుల వారికి ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాంటి రాశులలో మేషం, సింహ, ధనుస్సు ఉన్నాయి. ఈ రాశుల వారు వెండి ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. పొరపాటున వీరు వెండి ఆభరణాలు ధరిస్తే ఆశుపాలు జరిగే అవకాశం ఉంటుంది. శని గ్రహానికి వెండి వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల ఈ ఈ రాశుల వారికి శని గ్రహం అను కూలంగా ఉంటుంది. వెండి ఆభరణాలు ధరించడం వల్ల అది వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పై మూడు రాశుల వారు వెండి ఆభరణాలు ధరించకూడదు. అయితే మహిళల విషయంలో వేరెలా ఉంటుంది. మహిళలు కాళ్లకు పట్టీలు వంటివి ధరించుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.