Homeఆంధ్రప్రదేశ్‌Dharmaana Prasad Rao : ధర్మాన’ను లైట్ తీసుకుంటున్న సిక్కోలు వాసులు.. ఏ ప్లాన్ వర్కవట్...

Dharmaana Prasad Rao : ధర్మాన’ను లైట్ తీసుకుంటున్న సిక్కోలు వాసులు.. ఏ ప్లాన్ వర్కవట్ కావడంలే..

Dharmaana Prasad Rao : ఏపీ రాజకీయాల్లో సీనియర్ మంత్రి ధర్మాన స్టయిలే వేరు. ఎప్పటికప్పుడు రంగులు మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన ధర్మాన ఆ పార్టీలో పవర్ ను బాగానే అనుభవించారు. సిక్కోలును దశాబ్దాల కాలం పాటు ఏలారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీని స్థాపించిన జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ అవినీతి పెద్దమనిషి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కాంగ్రెస్ పార్టీలో వేల కోట్లు గడించి దొడ్డిదారిన పరిశ్రమలు ఏర్పాటుచేసుకున్న వైనంపై ధర్మాన చాలా సందర్భాల్లో జగన్ పై ఆరోపణలు చేశారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక చివరకు జగన్ పంచన చేరాల్సి వచ్చింది. కానీ ప్రజలు గమనిస్తున్నారు కనుక ఒకసారి గుణపాఠం చెప్పేశారు. గత ఎన్నికల్లో మాత్రం అత్తెసరు మెజార్టీతో గెలిపించారు. తనపై కామెంట్స్ గుర్తుచేసుకున్న జగన్ ధర్మానకు అదే స్థాయిలో బదులు తీర్చుకున్నారు. మూడున్నరేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టారు. అనివార్య పరిస్థితిలో విస్తరణలో చోటు కల్పించారు.

అయితే ధర్మానకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని భావిస్తున్న ఆయన చేయని ప్రయత్నం లేదు.. ఎక్కని గడప లేదు. అయితే పెద్దమనిషి పాత్రలో రాటుదేలిన ధర్మాన చెప్పిన మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు, అందునా సిక్కోలు వాసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మాటల్లో టెంపరితనం కనిపించినా.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలేమిటి? ఇప్పుడు చేస్తుందేమిటి అని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన అమవరాతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా స్థానికులచే నినాదాలు చేయించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు. చంద్రబాబు ఉత్తరాంధ్ర వచ్చి మనపైనే కుట్రలు చేస్తున్నారన్నా జనాలు స్పందించలేదు. విశాఖ రాజధానికి మద్దతు తెలపాలన్నా ప్రజల నుంచి ఉలుకూ పలుకూ లేదు. చివరకు ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాని డిమాండ్ చేసినా.. ధర్మానను సపోర్టు చేసే దిక్కు లేకుండా పోయింది.

అయితే ఇన్నాళ్లు వాయిసున్న నేతల్లో ఒకరుగా ధర్మానకు మంచి పేరు ఉండేది. అయితే విస్తరణలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన ఫేమ్ మసకబారింది. మరీ ముఖ్యంగా విశాఖ రాజధాని మద్దతుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడడం వెనుక భూదందా ఉందన్న ఆరోపణలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సిట్ దర్యాప్తులో తొలిపేరు ధర్మానదేన్న కామెంట్స్ వినిపించాయి. అందుకే జగన్ సర్కారు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ధర్మానతో విరుద్ధ ప్రకటనలు ఇప్పిస్తోందని.. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో పలుచన చేస్తోందన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. అయితే అవసరం ఎంత పనైనా చేయిస్తుందన్నట్టు ప్రజావ్యతిరేకతను తగ్గించుకునేందుకు ధర్మాన చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. ప్రజలు ఆహ్వానించడం లేదు.

తాజాగా ఆయన చంద్రబాబుపై మరో అస్త్రాన్ని వదిలారు. చంద్రబాబు పవర్ లోకి వస్తే మాత్రం సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలను హెచ్చరించే స్థితికి దిగజారిపోయారు. సంక్షేమమంటే చంద్రబాబుకు అసలు నచ్చదన్నారు. ఒకరికి ఇద్దామంటే ఆయన మనసు అంగీకరిందన్న వాదనను తెరపైకి తెచ్చారు. అదే వాదనను ఏపీ వ్యాప్తం చేయాలని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ధర్మాన మాటలను వినీవినీ విసిగిపోయిన ప్రజలు ఈ కామెంట్స్ ను సైతం లైట్ తీసుకున్నారు. పాపం ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలను ఆయనపై గౌరవంతో ప్రజలు ఓపిగ్గా వింటున్నారే తప్ప సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన ఎప్పటికప్పుడు రంగులు మార్చడమే అందుకు కారణం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular