Homeజాతీయ వార్తలు2020 మేలో ప్రజలు, సీఎంని వధించడం ఖాయం...!

2020 మేలో ప్రజలు, సీఎంని వధించడం ఖాయం…!


బీహార్‌ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ), జనతా దళ్‌ (యునైటెడ్‌)(జేడీయూ) పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆర్జేడీ నాయకుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మాట్లాడుతూ..2020లో ఎవర్ని వధిస్తారు? (2020 మే కిస్‌కా వధ్‌ హోగా?) అని ఆయన ప్రశ్నించారు. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రశ్నకు స్పందించిన ప్రజలు.. నితీష్‌ను అని బదులిచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్‌ కుమార్‌ ఓడిపోవడం ఖాయమన్నారు.

కంసుని వధించినట్టే ప్రజలు ఈసారి నితీష్‌ను ఓడిస్తారని ప్రతాప్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆర్జేడీ కార్యకర్తలు, మద్దతుదారులు నిబద్దతతో పని చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఇదే వేడుకలో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ వేణుగానం చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

తేజ్‌ పరమ శివుడి భక్తుడు. గతంలో శివుని అవతారంలో తేజ్ ప్రతాప్ దర్శనమిచ్చారు. శివుని మాదిరిగా నడుముకు పులి చర్మం తరహా వస్త్రాన్ని చుట్టుకున్నారు. ఈ వేషధారణతోనే శివభక్తులతో పాటు ఆయన ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తేజ్‌ప్రతాప్ రెండుసార్లు శంఖం పూరించారు. కాగా గతంలో తేజ్ ప్రతాప్ కృష్ణుడి వేషధారణతోనూ పూజలు నిర్వహంచి అందరినీ ఆకట్టుకున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version