AP Rain Alert: ఏపీ ప్రజలకు వచ్చే మూడు రోజులు హైఅలెర్ట్

ఈ ఏడాది సుదీర్ఘ వేసవి సాగింది. జూన్ మూడో వారం ప్రవేశించినా రుతు పవనాల జాడలేదు. వర్షాల జాడ సైతం కరువైంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రోజుకు సగటున 5 నుంచి 7 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రత నమోదైంది. దీనికితోడు వడగాల్పులు వీచాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Written By: Dharma, Updated On : June 27, 2023 8:44 pm

AP Rain Alert

Follow us on

AP Rain Alert: ఏపీ ప్రజలకు చల్లటి కబురు. రుతుపవనాల విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ శరవేగంగా విస్తరించడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలకు వానలు పలకరించాయి. మరో మూడు రోజుల పాటు రుతు పవనాలు బలంగా విస్తరించనుండడంతో వర్షాలు మరింత ఊపందుకోనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ ఏడాది సుదీర్ఘ వేసవి సాగింది. జూన్ మూడో వారం ప్రవేశించినా రుతు పవనాల జాడలేదు. వర్షాల జాడ సైతం కరువైంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రోజుకు సగటున 5 నుంచి 7 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రత నమోదైంది. దీనికితోడు వడగాల్పులు వీచాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జూన్ 12న విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. మండుతున్న ఎండలు దృష్ట్యా ప్రభుత్వం పాఠశాలలకు 24 వరకూ ఒంటిపూడ బడులు ఇచ్చింది. అయితే ఇప్పుడు తొలకరి జల్లులు పడుతుండం, రుతుపవనాలు విస్తరిస్తుండడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజుల పాటు విస్తరంగా పడనున్నాయి.

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. అటు సాయంత్రం పూట 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం ఇలానే కొనసాగే అవకాశముంది. ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.