Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Ippatam Victims: ఇప్పటం బాధితులకు పవన్ లక్ష సాయం.. అడ్డుకోవడానికి వైసీపీ రెడీ

Pawan Kalyan- Ippatam Victims: ఇప్పటం బాధితులకు పవన్ లక్ష సాయం.. అడ్డుకోవడానికి వైసీపీ రెడీ

Pawan Kalyan- Ippatam Victims: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు 50 ఎకరాల స్థలం ఇచ్చారని ఇప్పటం గ్రామాన్ని వైసీపీ సర్కారు నేలమట్టం చేసినంత పనిచేసింది. ఆ సభకు భూములిచ్చారన్న ఆగ్రహంతో 53 మంది ఇళ్లను ఆక్రమణల పేరిట తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ గ్రామంపై మోహరించి మరీ విధ్వంసాన్ని సృష్టించింది. దీనిపై పవన్ తీవ్రస్థాయిలో రియాక్టయ్యారు. బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల సాయం ప్రకటించారు. ఆ 53 కుటుంబాలకు శనివారం పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. కుదిరితే తాను స్వయంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లేకుంటే పార్టీ నేత నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా అందించాలని భావిస్తున్నారు.

Pawan Kalyan- Ippatam Victims
Pawan Kalyan- Ippatam Victims

అయితే పవన్ అందించే సాయాన్ని బాధితులు స్వీకరిస్తారా? లేదా రిజక్ట్ చేస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వం కక్ష కట్టి ఇళ్లు కూల్చివేసిందన్నది బహిరంగ రహస్యమే. కానీ ఇళ్లు కూల్చివేసిన తరువాత.. అదే శకలాల వద్ద ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చలేదని.. మీరు రాజకీయం చేయవద్దని.. మీ సానుభూతి అక్కర్లేదని ఫ్లెక్సీలు వెలిశాయి. సాక్షితో పాటు ప్రభుత్వ అనుకూల మీడియా దానిని పెద్దఎత్తున ప్రచారం చేసింది. విపక్ష నేతల పర్యటన సమయంలో ఇప్పటం ఘటన ప్రభుత్వానికి మైనస్ గా మారిందని ఎత్తుగడ వేశారు. అయితే దీని వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న టాక్ ఉంది. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు నిలిపివేస్తామనేసరికి బాధితులు సైతం బాధతో ఓకింత వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు పవన్ అందించే సాయం అందుకోకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందన్న ఆగ్రహం, ఆక్రోశం బాధితుల్లో స్పష్టంగా ఉంది. కష్టపడి తాము నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కూల్చివేసిందని తెలుసు. ప్రభుత్వం సేకరించిన భూమిని ఆక్రమించి వారు కట్టడలేదు. తమ పూర్వీకుల నుంచి దఖలుపడిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. కేవలం జనసేన సభకు స్థలం ఇచ్చామన్న ఒకే ఒక కారణంతోనే ప్రభుత్వం ఇంతటి విధ్వంసానికి దిగిందని బాధితులు ఇప్పటికీ చెబుతున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇప్పటం విలేజ్ పైనే మోహరించింది. సహజంగా ప్రభుత్వ భయం ఒకటి ఉంటుందని.. పవన్ వద్దకు వెళితే కేసులు పెడతారన్న ఒక టాక్ బాధితులను వెంటాడుతోంది.

Pawan Kalyan- Ippatam Victims
Pawan Kalyan- Ippatam Victims

అయితే బాధితులకు పరిహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. వారిలో భయం పోగొట్టడడం కూడా అంతే ముఖ్యమని పవన్ భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ఎండగట్టడం ప్రారంభించారు. ఇప్పటడంలో సొంత యజమానులు వలే ఇళ్ల ముందు ఫ్లెక్సీలను కట్టడాన్ని పవన్ తప్పుపడుతున్నారు. ఇప్పటం ఇష్యూ నుంచే ప్రభుత్వ వైఫల్యాల మరింత ఫోకస్ పెంచారు. పవన్ పోరాట స్ఫూర్తితో ఇప్పటం బాధితులు బయటకు వచ్చి ఆయన అందించిన రూ.లక్ష స్వీకరిస్తారో…లేకుంటే మీ సాయం మాకొద్దని ఫ్లెక్సీలు కట్టేందుకు అధికార పార్టీ పేటీఎం బ్యాచ్ కు అవకాశమిస్తారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular