AP MLC Results : రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్కు అన్ని విజయాలే వరిస్తూ వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి మానియా విరిగిపోతోందంటూ అధికార పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. గెలుపు ఉన్నప్పుడు కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే మాట్లాడేలా చేస్తుంది. అదే వైసీపీలో ఎన్నాళ్లు జరుగుతూ వచ్చింది. కానీ ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన ఓటమి ఇప్పుడు ఆ పార్టీలో నెగిటివ్ అంశాలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించింది.
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి గెలవడంతో అధికార పార్టీతో పాటు రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో సానుకూల అంశాలను అందిపుచ్చుకుని ఎదగడం సహజమే. అదే సమయంలో వ్యతిరేక అంశాల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరమో ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అంటారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు గుర్తు చేస్తున్నారు.
జగన్ రాజకీయ పంతం ప్రకృతికి విరుద్ధంగా సాగుతుందనే వాళ్ళు లేకపోలేదు. జగన్ సాంప్రదాయ రాజకీయానికి భిన్నంగా తనదైన ఆధునిక పోకడలతో అద్భుతాలు సృష్టిస్తున్నారని అభిప్రాయాలకు కొదవలేదు. కానీ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు అనేది వాస్తవం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన కేంద్రంగానే రాజకీయం సాగాలని, తాను తప్ప మరో నాయకుడిని ప్రధానికం తలచుకోకూడదనే జగన్ ఆలోచన, నియంతృత్వ ధోరణిగా కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది.
పవన్ కళ్యాణ్ ‘వైసీపీ వ్యతిరేక ఓటు’ స్లోగన్ ఓ నిశ్శబ్ద విప్లవం.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.