Pawan Kalyan : మొత్తానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వర్మ రూపంలో ఉన్న అడ్డంకిని చంద్రబాబు నాయుడు తొలగించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఒకానొక దశలో ఆ స్థానంలో ఆయన రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతోపాటు వర్మ అనుచరులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడ టిడిపి కార్యాలయంలో ఫ్లెక్సీలను తొలగించి తగలబెట్టారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో ఒకసారి గా కలకలం చెలరేగింది. ఎన్నికల ముందు ఈ పరిణామం కూటమికి నష్టం చేకూర్చుతుందని భావించి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ ను చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు తప్పవని.. ప్రభుత్వం ఏర్పడగానే సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీతో టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. కాగా, పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తామని చెప్పిన రోజు టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ అనుచరులు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ప్రచార సామగ్రిని తగలబెట్టారు. టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ అనుచరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఓ వర్గం మీడియా తెగ హైలెట్ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపటి రగిలించే విధంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు మేల్కొన్నారు. వెంటనే స్పందించారు. అంతకుముందు టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఒక లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది. అయితే అది ఫేక్ లెటర్ అని టిడిపి ప్రకటించింది. టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ ను సస్పెండ్ చేయాల్సిన ఉద్దేశం లేదని ప్రకటించింది.
ఈ ప్రకటనతో ఎన్వీఎస్ఎస్ వర్మ తన అనుచరులతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు విన్నారు. ఉండవల్లిలో చంద్రబాబుతో మాట్లాడేందుకు శనివారం వెళ్లారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు మెత్తబడ్డారు. 2014లో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కు కేటాయించిన తర్వాత ఎన్వీఎస్ఎస్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లేకపోతే వైసిపి పిలిచి ఆయనకు టికెట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ వైసీపీ కూడా వంగా గీత వైపు మొగ్గు చూపింది. దీంతో ఇక వైసిపి నుంచి కూడా పిలుపు వచ్చే అవకాశం లేదనుకున్న వర్మ.. చంద్రబాబుతో మాట్లాడారు. ఆయన ఇచ్చిన హామీలకు ఓకే చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.