
Pawan Kalyan- Kapu Community: జనసేనాని పవన్ తన పంథాను మార్చుకున్నారు. అది జనసేన పదో ఆవిర్భావ సభలో స్పష్టంగా కనిపించింది. ఇప్పటివరకూ రాజ్యాధికారం దక్కని కులాలకు ప్రాతినిధ్యం పెరగాలని భావిస్తున్నారు. అటువంటి వారందరికీ జనసేన ప్రోత్సహిస్తుందని చెప్పారు. రాజకీయ వేదికలపై సహజంగా నేతలు కుల ప్రస్తావన తీసుకురారు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కూడా ఆ విషయంలోనే జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే జనసేనపై కుల ముద్రలు వేసి కుట్రలు చేశారు. ఒక సామాజికవర్గానికే పరిమితం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అందుకే పవన్ జాగ్రత్త పడ్డారు. ఆవిర్భావ సభలో స్పష్టతనిచ్చారు.
ఇప్పటివరకూ ఏపీలో రాజ్యాధికారం దక్కించుకున్నవి రెండో కులాలు.ఒకటి రెడ్డి, రెండోది కమ్మ. 1983కు ముందు అంతా రెడ్డిల హవా కొనసాగగా.. 1983 తరువాత మాత్రం కమ్మల హవా కొనసాగింది. దీనినే ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. కాపుల్లో ఐక్యత పెరిగి.,. మిగతా కులాలకు పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. చాలాలోతులగా ఆలోచించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడ నేరుగా కాపుల కోసం ప్రస్తావించలేదు. అణగారిన వర్గాలు, అగ్రవర్ణాల ఆధిపత్యంలో చితికిపోయిన వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత కాపులపై ఉందని మాత్రమే అన్నారు. అన్ని కులాల ప్రస్తావన తీసుకొచ్చి వారి ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు.
అయితే స్ట్రయిట్ గా కాపుల పల్లకి మోసేందుకు మాత్రం పవన్ ఆసక్తిచూపడం లేదు. వెనుకబాటుతనం, ఐక్యత లేకపోవడంతో జరిగిన తప్పిదాలను గుర్తుచేస్తునే కాపుల మద్దతు పొందేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఏపీ సమాజంలో మార్పు రావాలంటే కాపులంతా ఐక్యంగా ఉంటూ.పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.అదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావ సమయంలో పార్టీపై కాపు ముద్ర వేశారు. అటు కాపులు కూడా పార్టీని ఓన్ చేసుకున్నారు. దానినే విపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. మిగతా వర్గాలను దూరం చేశాయి. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సాధించినా సీట్లపరంగా చిరంజీవి నష్టపోయారు. మరోసారి ఆ పరిస్థితి రీపిట్ కాకుండా పవన్ ప్రయత్నిస్తున్నారు.

కాపు కుల ప్రస్తావన తీసుకొస్తున్న పవన్ ఐక్యత గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఇతర వెనుకబాటు కులాలను ప్రస్తావిస్తూ వారికి అండగా కాపులు ఉండాలని పిలుపునిస్తున్నారు. కాపుల్లో ఐక్యత ఉంటే గత ఎన్నికల్లో కాపులు ఎక్కువగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో తాను ఎందుకు ఓడిపోతానని ప్రశ్నించారు. దీంతో కాపులను పునరాలోచనలో పడేశారు. అదే సమయంలో కాపులకు, ఇతర బీసీ వర్గాలకు ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు కూడా పవన్ ప్రయత్నించారు. అయితే రాజకీయ వేదికలపై కుల ప్రస్తావనలు తేవడానికి ఇష్టపడని ఈ రోజుల్లో ధైర్యంగా మాట్లాడి పవన్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు. అటు కాపులను తన వైపు తిప్పుకోవడంతో పాటు విపక్షాల విష బీజంలో ఉన్న బీసీల అనుమానాపు చూపులను పవన్ పటాపంచలు చేశారు.