https://oktelugu.com/

Modi Pawan meeting : మోడీతో పవన్ కళ్యాణ్ భేటి.. కలవరపడుతున్న జగన్, వైసీపీ బ్యాచ్!

Modi Pawan meeting : ఏదైతే రాజకీయాల్లో జరగకూడదని వైసీపీ భావిస్తోందో అదే జరగబోతోంది. రేపు విశాఖకు వస్తున్న ప్రధాని మోడీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటి ఖరారు అయ్యింది. ఈ వార్త తెలియగానే ఏపీ రాజకీయాలు షేక్ అయ్యాయి. ఎందుకంటే దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తితో పవన్ భేటి అనగానే వైసీపీ బ్యాచ్ వెన్నులో వణుకుపుడుతోంది. ఇప్పటికే సవాలక్ష కేసులతో సతమతమవుతున్న జగన్ బ్యాచ్ కు ఈ మోడీ-పవన్ భేటి కలవరపెడుతోంది. ఎందుకంటే వైసీపీ చేతిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2022 / 08:36 PM IST
    Follow us on

    Modi Pawan meeting : ఏదైతే రాజకీయాల్లో జరగకూడదని వైసీపీ భావిస్తోందో అదే జరగబోతోంది. రేపు విశాఖకు వస్తున్న ప్రధాని మోడీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటి ఖరారు అయ్యింది. ఈ వార్త తెలియగానే ఏపీ రాజకీయాలు షేక్ అయ్యాయి. ఎందుకంటే దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తితో పవన్ భేటి అనగానే వైసీపీ బ్యాచ్ వెన్నులో వణుకుపుడుతోంది. ఇప్పటికే సవాలక్ష కేసులతో సతమతమవుతున్న జగన్ బ్యాచ్ కు ఈ మోడీ-పవన్ భేటి కలవరపెడుతోంది. ఎందుకంటే వైసీపీ చేతిలో బాధితుడిగా పవన్ ఉన్నాడు. రేపు ఏదైనా మోడీని మెప్పిస్తే తమ మనుగడకే ప్రమాదం అని వైసీపీ ఆందోళన చెందుతోంది.

    విశాఖ, ఇప్పటంలలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను వెంటాడింది.. వేధించింది అధికార వైసీపీ. తమకు ఎదురేలేదన్నట్టుగా చెలరేగిపోయింది. ఇప్పటికే చంద్రబాబును ఏడిపించిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు పవన్ వెంట పడుతోంది. కానీ పవన్ ధైర్యంగా వీటన్నింటిని ఎదుర్కొంటున్నాడు. తన మిత్రపక్షం బీజేపీ సపోర్ట్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాడు.

    ‘ వైసీపీ అరాచకాలపై తనకు అవకాశం లేక మోడీ, అమిత్ షాలకు చెప్పడం లేదని.. ఫిర్యాదులు చేయడానికి నేనేం చిన్న పిల్లాడిని కాదు’ అంటూ ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీకి హెచ్చరికలు పంపారు. ఇప్పుడు మోడీతో భేటిలో వైసీపీ మీదనే పవన్ ఫిర్యాదు చేస్తారని.. ఆ పార్టీని కంట్రోల్ చేయాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఏపీ సీఎం జగన్ సహా వైసీపీ కీలక నేతల మెడకు అక్రమాస్తులు, సీబీఐ, ఐటీ, ఈడీకేసులున్నాయి. ఏపీలో వచ్చేసారి అధికారం కోసం జనసేన-బీజేపీ చూస్తోంది. ఈక్రమంలోనే మోడీతో పవన్ కలయిక ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పవన్ కనుక వైసీపీపై ఫిర్యాదు చేస్తే.. మోడీని మెప్పిస్తే ఏదైనా జరగవచ్చు. వైసీపీ అరాచకాలకు బ్రేక్ పడవచ్చు. అందుకే మోడీ-పవన్ భేటికి ఇప్పుడు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఏర్పడింది. రేపు ఏం జరుగనుంది? వైసీపీకి పవన్ చెక్ పెడుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.