Pawan Kalyan : దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ని మూడు విడతల్లో చేపట్టి లక్షలాది మందిని జనసేన పార్టీ సభ్యులు అయ్యేలా చేసాడు పవన్ కళ్యాణ్.జనసేన పార్టీ లో క్రియాశీలక సభ్యుడు అవ్వాలంటే 500 రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా పరిగణిస్తాడు పవన్ కళ్యాణ్.
ఈ సభ్యత్వం ఉన్నవారికి భవిష్యత్తులో ఏదైనా జరిగితే వారి కొయంబనికి 5 లక్షల రూపాయిలు సహాయం చెయ్యడం మాత్రమే కాకుండా, వాళ్ళ కుటుంబాలకు భవిష్యత్తులో ఏ చిన్న కష్టం వచ్చినా జీవితాంతం జనసేన పార్టీ మరియు ఆ పార్టీ నాయకులూ అండగా ఉంటారు.ఇప్పటి వరకు మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.మూడవ విడత నిన్నటి వరకు కొనసాగింది, ఈ విడత లో లక్షల సంఖ్యలో అభిమానులు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా నేడు ఉమ్మడి గోదావరి జిల్లాలలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలిక సభ్యుల కుటుంబాలకు ఆ పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజముండ్రి లో ఒక ప్రత్యేక మీటింగ్ ని ఏర్పాటు చేసి 12 కుటుంబాలకు 5 లక్షల చొప్పున 60 లక్షల రూపాయిలు భీమా పథకం ద్వారా అందజేశాడు.
పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కస్టపడి పనిచేస్తున్న వాళ్ళని జనసేన పార్టీ మర్చిపోదని, పవన్ కళ్యాణ్ గారు అన్నీ విధాలుగా మిమల్ని ఆదుకుంటూ మీ కుటుంబ సభ్యులలో ఒకడిగా మీకు అండగా ఉంటాడని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపాడు.అంతే కాదు మీ పిల్లల చదువు బాధ్యతని కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటాడంటూ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాడు నాదెండ్ల మనోహర్.తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం ఇంత చేస్తున్న పవన్ కళ్యాణ్ కి అభిమానులు చేతులెత్తి దండం పెడుతున్నారు.