Pawan Kalyan : ‘నీ ప్రేమ సల్లగుండ’.. జగన్ కు పవన్ కళ్యాణ్ పంచ్ అదుర్స్

Pawan Kalyan:  ఇటీవల విశాఖలో పర్యటించిన జగన్.. రోడ్డు పొడువునా తన ఫ్లెక్సీలు ఉండేసరికి హర్ట్ అయ్యాడు. అదేంటి ఆయన ఫ్లెక్సీలు ఉంటే ఎందుకు బాధపడుతారన్నదే కదా మీ ప్రశ్న.. ఎందుకంటే జగన్ విశాఖకు వచ్చింది ‘పర్యావరణ పరిరక్షణపై’ నిర్వహించిన సదస్సుకు.. ఆ సదస్సుకు వచ్చిన ఆయనకు ఉన్న ఫళంగా జ్ఞానోదయం కలిగి ప్లాస్టిక్ తో తయారైన ఫ్లెక్సీలు పర్యావరణాన్ని నాశనం చేస్తాయని.. అందుకే నా ఫొటోలతో ఫ్లెక్సీ లున్నా కూడా వాటన్నింటిని తొలగించాలని.. లేడికి లేచించే […]

Written By: NARESH, Updated On : August 27, 2022 10:01 pm
Follow us on

Pawan Kalyan:  ఇటీవల విశాఖలో పర్యటించిన జగన్.. రోడ్డు పొడువునా తన ఫ్లెక్సీలు ఉండేసరికి హర్ట్ అయ్యాడు. అదేంటి ఆయన ఫ్లెక్సీలు ఉంటే ఎందుకు బాధపడుతారన్నదే కదా మీ ప్రశ్న.. ఎందుకంటే జగన్ విశాఖకు వచ్చింది ‘పర్యావరణ పరిరక్షణపై’ నిర్వహించిన సదస్సుకు.. ఆ సదస్సుకు వచ్చిన ఆయనకు ఉన్న ఫళంగా జ్ఞానోదయం కలిగి ప్లాస్టిక్ తో తయారైన ఫ్లెక్సీలు పర్యావరణాన్ని నాశనం చేస్తాయని.. అందుకే నా ఫొటోలతో ఫ్లెక్సీ లున్నా కూడా వాటన్నింటిని తొలగించాలని.. లేడికి లేచించే పరుగు అన్నట్టు ఏపీలో ‘ప్లెక్సీలన్నింటిని’ బ్యాన్ చేశారు. ఇక నుంచి కేవలం బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలనే పెట్టాలని హుకూం జారీ చేశారు. ఇప్పటికిప్పుడు బ్యాన్ చేయడంతో అటు చిరు వ్యాపారులు, దాని మీద బతికేవాళ్లంతా రోడ్డున పడ్డ పరిస్థితి.

రాజు తలుచుకుంటే దెబ్బకు కొదవా? అన్నట్టు ఇప్పుడు జగన్ కు సడెన్ గా పుట్టుకొచ్చిన ‘పర్యావరణం’పై ప్రేమ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దీన్నే మన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రశ్నించారు. ప్రశ్నల పరంపర కొనసాగించారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు అటు జగన్ వద్ద.. ఇటు వైసీపీ వద్దే సమాధానమే లేని పరిస్థితి.

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై జగన్ ప్రభుత్వం నిషేధం విధించడంపై పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్ చేసి జగన్ ప్రభుత్వం పర్యావరణం ఎలా నాశనం చేసిందో వివరించారు.. రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల వివరాలు సేకరించాలని జనసేన శ్రేణులు, అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో వీటిని పెట్టి జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిద్దామని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ ఉద్యమం ఇప్పుడు జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

జగన్ ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవేంటో చూద్దాం..

‘రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి’

‘అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం’

‘మీమీ పరిధిలో ఉన్న కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి.’

‘సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చింది. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో?’

‘రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం.’

‘మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దామని’ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

సీఎం జగన్ కు పర్యావరణంపై సడెన్ గా పుట్టుకొచ్చిన ప్రేమను.. అందులోని ఆంతర్యాన్ని ప్రశ్నించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ స్టెప్ జనసేనకు అందివచ్చిన అవకాశంగా మారగా.. వైసీపీకి తలనొప్పిగా మారడం ఖాయం. జగన్ ఒకటి అనుకుంటే.. పవన్ ఇంకోటి తలపెట్టడంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ కు ‘పర్యావరణంపై ఉన్న ప్రేమ ఎంతో బయటపడనుంది.