https://oktelugu.com/

Pawan Kalyan: 14న ఏపీ రాజకీయాలను షేక్ చేయబోతున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లోని ఆగ్రహం.. ఆవేశం ఒక సునామీలా బయటపడుతుంది. ఆయన అసహాయుల పక్షాన వారి సమస్యలపై ప్రశ్నించాలే గానే ప్రభుత్వాలే షేక్ అవుతాయి.. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య నుంచి మొన్నటి రిపబ్లిక్ వేడుకలో ‘సినీ ఇండస్ట్రీ’ సమస్యల వరకూ పవన్ ప్రశ్నల పరంపరకు ఏపీ సర్కార్ యే వణికిన పరిస్థితి. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. ఈ సీఎం, ఎమ్మెల్యే సీట్లు ‘తుచ్చం’ అని ధైర్యంగా చెప్పగల నేత […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2022 / 10:32 PM IST
    Follow us on

    Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లోని ఆగ్రహం.. ఆవేశం ఒక సునామీలా బయటపడుతుంది. ఆయన అసహాయుల పక్షాన వారి సమస్యలపై ప్రశ్నించాలే గానే ప్రభుత్వాలే షేక్ అవుతాయి.. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య నుంచి మొన్నటి రిపబ్లిక్ వేడుకలో ‘సినీ ఇండస్ట్రీ’ సమస్యల వరకూ పవన్ ప్రశ్నల పరంపరకు ఏపీ సర్కార్ యే వణికిన పరిస్థితి.

    ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. ఈ సీఎం, ఎమ్మెల్యే సీట్లు ‘తుచ్చం’ అని ధైర్యంగా చెప్పగల నేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసం.. వారి సమస్యల పరిష్కారం కోసమేనని అంత నిక్కచ్చిగా చెప్పగల నేర్పరి పవన్. అప్పుడూ ఎప్పుడూ ప్రజలు గెలిపించినా.. గెలిపించకపోయినా వారి వెంటే ఉంటూ వస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలకు గొప్ప ఊపు ఉంటుంది. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అది ఒక ప్రభంజనంలా సాగుతోంది. పవన్ వీధుల్లోకి వస్తేనే అభిమానులు, జనసైనికులు పోటెత్తుతారు.ఇక ఆయన ఒక సభ పెడితే రాకుండా ఉంటారా? అంతకుమించిన ఊపు ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.

    ‘రిపబ్లిక్’ లాంటి ఒక చిన్న సినిమా వేడుకలో మాట్లాడితే ఏపీ ప్రభుత్వం షేక్ అయ్యింది. అలాంటిది తను పెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడితే ఏం జరుగుతుందో? ఎవరి పీఠాలు కదులుతాయో? ఏపీ ఎంతగా ఆగం అవుతుందోనన్న భయాలు ఇప్పుడు అధికార వైసీపీ వర్గాలను షేక్ చేస్తున్నాయట.. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని సమస్యలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపైనే నిలదీసే అవకాశాలు ఉన్నాయి.

    2014లో జనసేన పార్టీ యాక్టివ్ అయ్యింది. అయితే నాడు పవన్ పోటీచేయకుండా నాటి టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చి వారిని అధికారంలోకి తీసుకురావడంలో సహాయపడ్డారు. అయితే తర్వాత మోడీ, చంద్రబాబులు హామీల అమలులో విఫలం కావడంతో 2019లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీచేశారు. నాడు ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీచేసినా పవన్ పార్టీ గెలవలేదు. అయితే ప్రజల్లోనే తేల్చుకొని మరోసారి వారి చెంతకే వెళ్లారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళుతున్నారు. 2024లో ఏపీలో రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయబోతున్నారని.. బీజేపీ, టీడీపీలను కలుపుకొని పోవాలా? ఒంటరిగా ఏపీలో ముందుకెళ్లాలన్న దానిపై సంచలన ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. 2024లో ఏపీ సీఎం కుర్చీలో పవన్ కుర్చునేలా అడుగులు వేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు పక్కా ప్రణాళిక రూపొందించారని.. దాన్ని ఆవిర్భావ సభా వేదికపై మార్చి 14న ప్రకటిస్తారని సమాచారం. ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా సంచలన ప్రకటనలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

    ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. పవన్ ప్రెస్ మీట్ , లేదా మాట్లాడుతున్నారంటే చాలు వైసీపీ బ్యాచ్ వణికిపోతున్న పరిస్థితి. ఇటీవల ‘భీమ్లానాయక్’ మూవీకి ఏపీ ప్రభుత్వం కల్పించిన వివాదాలను పవన్ ఎలుగెత్తి చాటే అవకాశం ఉంది. ఆ ప్రీరిలీజ్ వేడుకలోనూ కాస్త అంటించిన పవన్ ఇఫ్పుడు ‘జనసేన ఆవిర్భావ’ సభలో చెలరేగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సమస్యలు, సినీ ఇండస్ట్రీ విషయంలో జగన్ చేసిన తప్పులను పవన్ కళ్యాణ్ నిగ్గదీసే అవకాశాలున్నాయి. ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభకు వైసీపీ సర్కార్ పెట్టిన ఇబ్బందులను పవన్ ఎలుగెత్తి చాటే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ ఆవిర్భావ సభా వేదికగా పవన్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా ప్రసంగిస్తారని.. ఆ రోజు కోసం జనసైనికులు ఆత్రూతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 14న జరిగే సభకు ఏపీ ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.