జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రముఖ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి రెండు రోజులుగా వరుస ప్రెస్ మీట్ లు పెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న అయితే పవన్ కళ్యాణ్ ను పోసాని అత్యంత కించ పరుస్తూ వ్యక్తిగతంగా, ఆయన కుటుంబంపై తీవ్రంగా దుర్భాషలాడాడు.
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక.. ఆయనతో పోటీపడలేక.. ఆయన సంధించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక.. పవన్ క్యారెక్టర్ ను చంపడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసానిపై నిన్న రాత్రి దాడికి ప్రయత్నించారు.
పోసాని అయితే పవన్ పై వ్యక్తిగత దూషణతో అధమ స్థాయికి దిగజారాడు. ఒక పంజాబీ అమ్మాయికి లింక్ పెట్టి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతోనే అసలు ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. గతంలో ఇదే టాపిక్ పై చనిపోయిన క్రిటిక్ కత్తి మహేష్ రచ్చ చేశాడు.
ఈ క్రమంలోనే పోసాని అచ్చం క్రిటిక్ కత్తి మహేష్ లాగానే పవన్ పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ దెబ్బతీసే కుట్రకు తెరతీశారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లోనూ ఇదే కత్తి మహేష్ సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్ కు వచ్చి రచ్చ సృష్టించాడు. అచ్చం పోసానిలాగానే ప్రవర్తించాడు. నిన్న పోసోని కూడా సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్ నే పవన్ ను తిట్టడానికి ఉపయోగించడంతో దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉందని పవన్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సినీ పరిశ్రమ సమస్యలపై పవన్ సంధించిన ప్రశ్నలకు అటు ఏపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేని పరిస్థితి. తెలుగు చిత్ర పరిశ్రమను కదిలించిన పవన్ ప్రసంగాన్ని పక్కదారి పట్టించడానికే పోసానిని కొందరు వెనుకుండి నడిపిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ దీని వెనుకుండి కుట్ర చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన కత్తి మహేష్ లాగానే పోసానికి అదే గతి పడుతుందని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. విధి ఎప్పటికీ పవన్ ను తిట్టినందుకు వదలిపెట్టదని ఆరోపిస్తున్నారు.