Pawan Kalyan-Twitter: పవన్ కల్యాణ్ అంటే ఇప్పుడొక ప్రభంజనం. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోవర్స్ తెలుగు రాష్ట్రాల్లో మరెవరికీ లేరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల సందడికి అంతే ఉండదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో నటనలో ఎన్నో మైలురాళ్లు అందుకుంటున్నాడు. తాజాగా వచ్చిన భీమ్లానాయక్ లో పవన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

క్రికెట్ క్రీడాకారులు, సినిమా కథానాయకులు, రాజకీయ నాయకులకు అశేష అభిమానులు ఉండటం తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మంది అభిమానులుండటం సహజమే. కానీ పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానుల సంఖ్య తెలిస్తే షాకే. ఆయనకు దాదాపు 5 మిలియన్ల మంది అభిమానులను కలిగి ఉండటం ఓ సంచలనమనే చెప్పాలి. తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ ఫాలోవర్స్ ఐదు మిలియన్లకు దాటిపోవడాన్ని ఓ గొప్ప ఘనతగా చెప్పొచ్చు.
Also Read: Operation Lotus: వికటిస్తున్నా ఆపరేషన్ లోటస్.. మూడు రాష్ట్రాల్లో బెడిసి కొట్టిన వ్యూహాలు!
తమ అభిమాన నటుడికి అంత మంది అభిమానులు ఉండటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు 4.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఒక మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానులు మరెవరీకీ లేరు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

తమ నేత ఇంత ఖ్యాతి సంపాదించుకోవడంపై అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ట్విట్టర్ ఫాలోవర్స్ లో రెండో స్థానంలో చంద్రబాబు, మూడో స్థానంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు అంతమంది ఫ్యాన్స్ ఉండటం కొత్తేమీ కాదు. లక్షల్లో అభిమానగణం ఉండడంతోనే పవన్ సినిమాలకు అంతటి క్రేజ్ వస్తోంది. ఇక రాజకీయాల్లో కూడా ఆయన తనదైన మార్కు సాధించాలని చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ట్విట్టర్ లో ఉన్న అభిమానులు బయట కూడా అంతే తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ కు సపోర్టు చేస్తే విజయం గ్యారెంటీ అంటున్నారు.
Also Read:India- Asia Cup 2022: ఏ ఒక్కరిలో పోరాడాలనే కసి లేదు.. ఈ టీమిండియా కప్ తెచ్చే జట్టేనా?
[…] Also Read: Pawan Kalyan-Twitter: జగన్, చంద్రబాబులను మించిపోయి… […]