Operation Lotus: అన్ని రోజులూ ఒకేలా ఉండవు.. అన్ని పూజలకు ఒకే మంత్రాలు ఉండవు.. అన్ని విజయాలకు ఒకే రకమైన వ్యూహాలు పనిచేయవు.. ఎంతటి అత్యున్నత వ్యూహ చరకుడైనా ఒక్కడో ఒకచోట విఫలం అవక తప్పదు.. ప్రధాని మోదీ, హోం హంత్రి అమిత్‌షా వ్యూహాలతో దేశ వ్యాప్తంగా విజయ యాత్ర చేస్తున్న బీజేపీకి ఇటీవల వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మోదీ–షా వ్యూహం రచించారంటే విజయం సాధించాల్సిందే అన్నట్లు ఉండేది మొన్నటి వరకు కానీ ఇటీవల ఆ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. సక్సెస్ కాకపోగా, రివర్స్ కూడా అవుతున్నాయి. ఎదురే ఉండవు అన్న వ్యూహాలకు ఎదురుదెబ్బ తగలడం కమలనాథులను పునరాలోచనలో పడేస్తోంది.

ఆపరేషన్ లోటస్‌తో పలు రాష్ట్రా్టల్లో కమల వికాసం..
ఆపరేషన్ లోటస్ పేరిట మోదీ–షా ద్వయం వ్యూహం రచిస్తూ ఎనిమిదేళ్లలో బీజేపీ దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. పార్టీలో చీలికలు తేవడం, ఎమ్మెల్యేలను కొనడం, కమలం వైపు తిప్పుకోవడం, పార్టీలను విలీనం చేసుకోవడం ద్వారా 2014 నుంచి 2022 వరకు అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు, తర్వాత ఆరాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ విలీనం, ఇటీవల మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగబాటు తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఏకనాథ్‌షిండే ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణ. గతంలో పూర్తి మెజారిటీ రాకపోయినా గోవాలో బీజేపీ అధికారం చేపట్టింది. ఈశాన్య భారతంలోనూ పత్తా లేని బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇలా మోదీ షా వ్యూహం రచిస్తే తిరుగు ఉండదు అన్నట్లుగా మారింది దేశంలో రాజకీయ పరిస్థితి.
Also Read: India- Asia Cup 2022: ఏ ఒక్కరిలో పోరాడాలనే కసి లేదు.. ఈ టీమిండియా కప్ తెచ్చే జట్టేనా?
బెడిసి కొడుతున్న మోదీ–షా వ్యూహాలు..
తిరుగు లేదనుకున్న మోదీ–షా వ్యూహాలు కొన్ని రోజులుగా బెడిసి కొడుతున్నాయి. వరుసగా ఆపరేషన్ లోటస్ విఫలం అవుతోంది. ఇటీవల జార్ఖండ్, ఢిల్లీలో మోదీ–షా వ్యూహాలు విఫలం కాగా, బీహార్‌లో అయితే ఆపరేషన్ లోటస్ వికర్ష్‌గా మారింది.
– ఇటీవల జార్ఖండ్‌లో జేఎంఎంను తమవైపు తిప్పుకునేందుకు మోదీ–షా వ్యూహ రచన చేశారు. ఇందులో కొంతవరకు విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు కూడగట్టుకున్నారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో జేఎంఎం బీజేపీతో ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కేంద్రం ఎన్నికల సంఘం ద్వారా మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను ఎమ్మెల్యేకు అనర్హుడిగా ప్రకటించింది. అయినా జేఎంఎం బీజేపీ చెంతకు రాకపోగా, హేమంత్ సొరేన్ ప్రత్యేక వ్యూహంతో అసెంబ్లీలో బలం నిరూపించుకున్నాడు. మరో ఆరు నెలల వరకు అవిశ్వాసం పెట్టకుండా చేసుకున్నాడు. ఈలోగా తాను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని సొరేన్ భావిస్తున్నాడు.
– ఇక ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని తమవైపు తిప్పుకునేందకు చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైంది. బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుముఖంగా లేకపోగా, గుజరాత్‌లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో కేంద్రం ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై లిక్కర్ స్కాంలో ఉన్నట్లు సీబీఐ ద్వారా కేసు పెట్టింది. ఈడీని కూడా రంగంలోకి దింపింది. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కూడా ప్రయత్నించినట్లు మనీష్ సిసోడియా ఆరోపించారు. అయినా ఆప్ మోదీతో ఢీ అంటే ఢీ అంటోంది.

– బిహార్‌లో మొన్నటి వరకు కమలం పార్టీలో కలిసి సాగిన జేడీఎస్ ప్రభుత్వం ఇటీవల కూలిపోయింది.. కాదు సీఎం నితీశ్‌కుమారే కూల్చారు. బీజేపీకి కటీఫ్ చెప్పిన నితీశ్, ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి మోదీ–షా వ్యూహాం బెడిసికొట్టేలా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల సమయంలోనే జేడీఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నించింది. ఈమేరకు జేడీఎస్ పోటీ చేసిన స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది. దీంతో జేడీఎస్‌కు బీజేపీకన్నా తక్కువ స్థానాలు వచ్చాయి. అయినా మహారాష్ట్రలో శివసేన లాగా జేడీఎస్ కాంగ్రెస్ చెంతకు వెళ్లకుండా నితీశ్‌కుమార్‌కే సీఎం అవకాశం ఇచ్చింది. అయితే నితీశ్ç Üర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది. ఆసీపీ సింగ్ ద్వారా జేడీయూలో చీలిక తేవడానికి బీజేపీ ప్రయత్నించింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన నితీశ్ ఆసీపీ.సింగ్‌కు మరోమారు రాజ్యసభ అవకాశం ఇవ్వలేదు. ఈ పరిణామాలతో బీజేపీ నితీశ్‌ను పదవీచితుడిని చేసే ప్రయత్నాలు వేగవంతం చేసింది. బీజేపీ ముప్పును ముందే పసిగట్టిన నితీశ్ స్వయంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి సర్కార్ ఏర్పాటు చేశారు.
ఇక తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనూ ఆపరేషన్ లోటస్ అమలుకు అమిత్‌షా వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆపరేషన్ లోటస్ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఓడిపోతే ఇక్కడ కూడా ఆపరేషన్ లోటస్ వికటించినట్లే భావించాలి.
Also Read:Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్
[…] Also Read: Operation Lotus: వికటిస్తున్నా ఆపరేషన్ లోటస్… […]