Pawan Kalyan: వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్

అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ వెన్నునొప్పి ప్రారంభమైంది. సినిమాల చిత్రీకరణతో పాటు జనసేన కార్యక్రమాల్లో తీరిక లేకుండా పవన్ గడుపుతున్నారు. రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న సమయంలో ఇదే మాదిరిగా అస్వస్థతకు గురయ్యారు.

Written By: Dharma, Updated On : October 3, 2023 4:40 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో పవన్ వారాహి యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి కృష్ణాజిల్లా అవనిగడ్డలో మూడో విడత వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. మూడో రోజు మంగళవారం జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెన్ను నొప్పి బాధించడంతో కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. దీంతో జనసైనికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా పవన్ వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో వెన్ను పూసలకు గాయాలయ్యాయి. తరచూ అప్పటినుంచి వెన్ను నొప్పి బాధిస్తూ వచ్చింది. గత ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలతో బిజీగా మారడంతో తిరగబెట్టింది. దీంతో అప్పట్లో ఆసుపత్రిలో చేరిన పవన్ వైద్య చికిత్సలు పొందారు.

అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ వెన్నునొప్పి ప్రారంభమైంది. సినిమాల చిత్రీకరణతో పాటు జనసేన కార్యక్రమాల్లో తీరిక లేకుండా పవన్ గడుపుతున్నారు. రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న సమయంలో ఇదే మాదిరిగా అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఒకరోజు యాత్రకు బ్రేక్ నిచ్చారు. మళ్లీ మొదటి రోజే యధాతధంగా యాత్రను కొనసాగించారు. గత రెండు రోజులుగా వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్.. జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు జిల్లాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం నుంచి ఎంతో ఓపికగా వారి సమస్యలను విన్నారు. అయితే బ్యాక్ పెయిన్ బాధించడంతో విలవిల్లాడిపోయారు. బాధను తట్టుకోలేక కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెనుతిరిగారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్యాక్ పెయిన్ తో బాధపడుతుండడంతోమూడో రోజు యాత్రపై స్పష్టత లేకుండా పోయింది.

అటు సీఎం జగన్ క్లాస్ వార్ పై జనవాణి వేదికపై పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా జగన్ హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అమలు చేయకుండా అందర్నీ మోసం చేశారని ఆరోపించారు. అసలు జగన్ ఉద్దేశం ఏంటి? నిజంగా క్లాస్ వారు చేస్తుంది జగనే. పేదలకు అండగా ఉండకుండా మాటలతో మోసం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. జనసేన సంకీర్ణ ప్రభుత్వంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.