https://oktelugu.com/

Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ

Pawan Kalyan vs YCP:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన జనసేన 9వ ఆవిర్భవ సభలో పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లు ముందుగానే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడం, పొత్తులపై క్లారిటీ ఇవ్వడం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అవలంభించాల్సిన వ్యూహాలను జనసైనికులకు వివరించే ప్రయత్నం చేశారు. జనసేన సభ ఏపీలో సూపర్ హిట్ కావడంతో వైసీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2022 / 01:41 PM IST
    Follow us on

    Pawan Kalyan vs YCP:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన జనసేన 9వ ఆవిర్భవ సభలో పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లు ముందుగానే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడం, పొత్తులపై క్లారిటీ ఇవ్వడం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అవలంభించాల్సిన వ్యూహాలను జనసైనికులకు వివరించే ప్రయత్నం చేశారు.

    Pawan Kalyan

    జనసేన సభ ఏపీలో సూపర్ హిట్ కావడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ముఖ్యంగా ‘వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను’ అని పవన్ చెప్పిన వ్యాఖ్యలకు ద్వందార్థాలు, నానార్థాలు వెలికి తీస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ఎక్కడా స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ వైసీపీ నేతలు పదేపదే టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని జనాలను కన్ఫ్యూజన్ చేస్తున్నారు.

    Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!

    బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తానని పవన్ కల్యాణ్ అనడంతో వీరిద్దరు కలిసి పోటీ చేస్తారని క్లారిటీ వచ్చింది. ఇక వైసీపీ వ్యతిరేకత ఓటును చీలనివ్వను అంటే అది టీడీపీ పొత్తు అని వైసీపీ తెగ ప్రచారం చేస్తోంది. జనసేనను అభాసుపాలు చేసేలా జనాల్లో హోరెత్తిస్తోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు గంపగుత్తగా వైసీపీకి ఎలా అయితే వెళ్లిందే అదే రీతిలో జనసేనకు మారాలని పవన్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే జన సైనికులంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా జనసేనకు మళ్లించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. కానీ దీన్ని టీడీపీకి అప్లై చేసి వైసీపీ ప్రతిపక్షాలను ఒకే గాటిన కట్టే ప్రయత్నం చేస్తోంది.

    వైసీపీ వ్యతిరేకత ఓటు ప్రతిపక్షాలకు చీలకుండా కేవలం జనసేనకు మాత్రమే వెళితే ప్రభుత్వం మారక తప్పదు. దీనిని గ్రహించే వైసీపీ నేతలు టీడీపీని తెరపైకి తీసుకొచ్చి ఆపార్టీలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు. జనసైనికులు టీడీపీకి పల్లకిని మోస్తారా? అంటూ వారిని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసైనికులు మాత్రం పవన్ ఏం చెబితే అదే చేస్తామని చెబుతున్నారు.

    YCP

    పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో మాత్రమే పొత్తులో ఉన్నారని క్లారిటీ ఇస్తున్నారు. జనసేన-బీజేపీ కూటమితో టీడీపీ, వామపక్షాలు కలిసినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. పొత్తు విషయంలో జనసేన ఏం చెబితే ఆ నిర్ణయాన్ని మాత్రమే పాటిస్తామని జనసేన పార్టీల నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని జనసైనికులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు చెబుతున్నట్లు జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందా? లేదా అనేది తెలియంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే..!

    Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?

    Tags