Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు కేంద్రంతో ఫైట్ చేయడం లేదని ఆయన విమర్శించారు. విశాఖ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఉత్తరాంధ్రుల ప్రయోజనాల గురించి పార్లమెంటులో ప్రస్తావించే ధైర్యం ఏ ఒక్క ఎంపీకి కూడా లేకపోవడం దురదృష్టకరం అన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళితే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని జనసేన అధినేత అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. అయినా, సీఎం జగన్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

మరో రెండు నుంచి మూడు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. కేంద్రం మాత్రం విశాఖ ప్రైవేటీకరణ ఆగదని, ఇంకెదైనా సమస్య ఉంటే చెప్పాలని ఏపీ నాయకులకు సూచిస్తోంది. వైసీపీ నేతలు మాత్రం తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అందుకోసం పోరాటానికి కూడా సై అంటున్నారు. కానీ లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ మాత్రం ఇంతవరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం నినాదాలు కూడా చేయలేదు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఏపీలో పోరాడేందుకు రెడీగా వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలంటూ పవన్ 3 రోజుల పాటు జనసేన నేతలతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. కొన్ని లక్షల ట్వీట్స్‌ను వైసీపీ ఎంపీలకు ట్యాగ్ చేశారు. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రాణాలు అర్పించైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు.. ప్రాణాలు అర్పించడం వరకు వద్దు కానీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సూచించారు.
Also Read: Chandrababu: వంశీకి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం.. ఏపీలో రసవత్తర రాజకీయాలు
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని పార్లమెంటులో అధికార పార్టీ ఎంపీలు గట్టిగా వినిపించాలని జనసేన అధినేత పవన్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ అధికార పార్టీగా టార్గెట్ చేసి ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పవచ్చు.