https://oktelugu.com/

Pawan Kalyan: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?

Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అవసరం ఎంతైనా ఉంది. పవన్ పై అభిమానంతోనే సినిమా అభిమానంతోనూ ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. ఏపీలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. జగన్ ది నియంత పాలనలా నడుస్తోందంటున్నారు. మంత్రుల భాష వ్యవహారశైలి చూస్తే ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోంది. మరి ఇలాంటి పాలనను గద్దెదించాలంటే ఏం చేయాలి? ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయింది. చంద్రబాబుకు అనుకూల మీడియా ప్రచారం మరీ దారుణంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 / 08:01 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అవసరం ఎంతైనా ఉంది. పవన్ పై అభిమానంతోనే సినిమా అభిమానంతోనూ ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. ఏపీలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. జగన్ ది నియంత పాలనలా నడుస్తోందంటున్నారు. మంత్రుల భాష వ్యవహారశైలి చూస్తే ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోంది. మరి ఇలాంటి పాలనను గద్దెదించాలంటే ఏం చేయాలి? ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయింది. చంద్రబాబుకు అనుకూల మీడియా ప్రచారం మరీ దారుణంగా ఉంది. జగన్ పరిపాలన మొదలు పెట్టకముందే ఆయనపై అభాసుపాలు చేయడం చంద్రబాబుకు మైనస్ గా మారింది. నిజంగా జగన్ తప్పులు చేసినా టీడీపీ మీడియా చేసే ఊదరగొట్టే కథనాలను చూస్తే నమ్మే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. జనాలు ఈ మీడియాను  అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు.

    Ram view point

    విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు, టీడీపీకి ఇప్పుడు జగన్ ను నిజంగానే ఎదుర్కొనే సత్తా లేదు. తమకు తాముగా విశ్వసనీయతను వారు కోల్పోయారని చెప్పొచ్చు. కాబట్టి ఏపీ విషయంలో చంద్రబాబు, జగన్ లు చేసింది తప్పే. ఇద్దరూ ఒకరినొకరు బూతులు తట్టుకోవడంతో ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించారు. వీరిద్దరూ రాజకీయాలను మలినం చేశారు.

    Also Read: అమరావతి రైతుల పాదయాత్రకు పవన్ వెళ్లడట..!

    అందుకే ఇప్పుడు ఏపీలో మూడో శక్తి అవసరం. ఏపీలో ప్రత్యామ్మాయ రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మూడో శక్తిగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను చూద్దామా? అంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి ఎప్పుడో అంతర్థానమైపోయింది. ఇక దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో స్కోప్ తక్కువ. దేశంలోనే బీజేపీకి అట్టడుగున స్థానం ఎక్కడైనా ఉందంటే అది ఏపీలోనే.. మోడీ ప్రతిష్ట దేశం మొత్తం బాగున్నా.. ఏపీలో అట్టడుగున ఉంది.

    జగన్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఇప్పట్లో అయితే ఎదగలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కమ్యూనిస్టుల పరిస్థితి తీసికట్టుగా మారింది. ఇక ఏపీలో మూడో శక్తిగా మారాల్సిన అవసరం ఎవరికైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ కే. ఆ స్కోప్ కేవలం జనసేనానికే ఉంది. ఈ క్రమంలోనే పవన్ ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? ఎలా ప్రజల్లోకి వెళ్లాలనే దానిపై సునిశిత విశ్లేషణను ‘రామ్ టాక్’ వ్యూ పాయింట్ స్పెషల్ వీడియోను కింద చూడొచ్చు.

    Also Read: ఎంత అవమానం.. ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని ఏపీ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారా?