Pawan Kalyan- Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయ పార్టీల అధినేతలు పోటీచేసే నియోజకవర్గాలు పిక్స్ డ్ గా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ పులివెందుల నుంచి, విపక్ష నేత చంద్రబాబు కుప్పం నుంచి బరిలో దిగడం ఖాయంగా నిలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీచేసిన ఆయనకు రెండు చోట్ల నిరాశే ఎదురైంది. కానీ ఈ సారి అలా జరుగకుండా ఆయన పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి కూడా పవన్ రెండు చోట్ల పోటీచేయాలని జన సైనికులు, అభిమానులు కోరుతున్నారు. రెండు చోట్ల పోటీచేస్తే ఆ జిల్లాల పరిధిలో మిగతా నియోజకవర్గాల గెలుపుపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే గత ఎన్నిక మాదిరిగా పవన్ చూపు అటు గోదావరి.. ఇటు విశాఖపై ఉందన్న ప్రచారమైతే ఉంది. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన గాజువాక నుంచి పవన్ బరిలో దిగితే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారని శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ఉద్యమం, గత ఎన్నికల్లో ఓడించి తప్పుచేశామని ప్రజల్లో వ్యక్తమవుతున్న బాధ వెరసి ఇక్కడ కానీ పవన్ పోటీచేస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చని జన సైనికులు గంటాపథంగా చెబుతున్నారు.

అయితే పవన్ మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఓ ప్రైవేటు సంస్థతో సర్వే చేయించుకున్న పవన్ కు ఉత్తర నియోజకవర్గమే సేఫ్ జోన్ గా నిలుస్తుందని నివేదిక వచ్చిందట. అక్కడ కాపు సామాజికవర్గంతో పాటు నగర ఓటర్లు అధికం. పవన్ లాంటి వాయిస్ ఉన్న నేత అసెంబ్లీలో అడుగు పెట్టాలని అక్కడ ప్రజలు భావిస్తున్నారుట. అయితే అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన గెలుపొందారు. అయితే టీడీపీలో అంత యాక్టివ్ రోల్ లో లేరు. కానీ క్రియాశీలకమయ్యేందుకు సిద్ధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచోమరోసారి పోటీచేయాలని భావిస్తున్నారు. తాను కాకుంటే తన మేనల్లుడ్ని అక్కడ నుంచిబరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అటు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సైతం అక్కడ నుంచి పోటీచేసేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చాక బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పవన్ చూపు ఉత్తర నియోజకవర్గం పై ఉందని తెలియడంతో అటు గంటా, ఇటు విష్ణుకుమార్ రాజు కాస్తా విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. అయితే గంటా ప్రతి ఎన్నికలో నియోజకవర్గం మార్చి ప్రయోగం చేస్తుంటారు. సక్సెస్ అయ్యారు కూడా. ఈ సారి కూడా అలానే చేస్తారన్న ప్రచారం అయితే ఉంది.పైగా పొత్తుల్లో భాగంగా పవన్ వస్తే అటు గంటా, ఇటు విష్ణుకుమార్ రాజు ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గం చూసుకోవాల్సి ఉంటుంది. సో పవన్ ఇటు గంటాకు, అటు విష్ణుకుమార్ రాజుకు షాకిచ్చారన్న మాట.