https://oktelugu.com/

Pawan Kalyan: నేను తప్పు చేశాను క్షమించండి.. మళ్లీ చేయనన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తప్పు ఒప్పుకున్నాడు.. తాను తప్పు చేశాను క్షమించండి అంటూ ప్రజల ముందు ప్రాధేయపడ్డాడు. చేతులు ఎత్తి మొక్కాడు. ఇది మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు సాక్షిగా జరిగింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గడిచిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. ఇంత స్టార్ డం వదులుకొని రావడానికి కారణాన్ని వెల్లడించి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్నీ వదిలేసి ప్రజల్లోకి రావడానికి 2009లో రాజకీయాల్లోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2021 / 07:27 PM IST
    Follow us on

    పవన్ కళ్యాణ్ తప్పు ఒప్పుకున్నాడు.. తాను తప్పు చేశాను క్షమించండి అంటూ ప్రజల ముందు ప్రాధేయపడ్డాడు. చేతులు ఎత్తి మొక్కాడు. ఇది మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు సాక్షిగా జరిగింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    గడిచిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. ఇంత స్టార్ డం వదులుకొని రావడానికి కారణాన్ని వెల్లడించి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్నీ వదిలేసి ప్రజల్లోకి రావడానికి 2009లో రాజకీయాల్లోకి వచ్చి వైదొలగి మోసం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. రెండు చేతులు జోడించి సారీ చెప్పారు. 2009లో చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకుంటున్నట్టు పవన్ ఎమోషనల్ అయ్యారు.

    ఒకసారి మాట ఇచ్చి పవన్ కళ్యాణ్ తప్పారు.2009లో ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి తమను నమ్మిన కాపులు ఇతర కులాలను మోసం చేశామన్న గిల్టీ ఫీలింగ్ పవన్ లో ఇప్పటికీ ఉంది. అదే తాజాగా బయటపడింది. ఆ బాధ్యత తీసుకునే ప్రజలు ఏ శిక్ష విధించినా పవన్ అనుభవించడానికి రెడీ అయ్యారు.

    అందుకే పవన్ వ్యాఖ్యల్లో తనకు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అన్న మాట వినిపించింది. కేవలం తాను ప్రజా సేవ చేస్తానని.. మీరు ఎన్నికల్లో గెలిపించినా గెలిపించకపోయినా.. సీఎం సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తాను ప్రజల తరుఫున ఈసారి నిలబడుతానన్న హామీని పవన్ ఇచ్చాడు.

    ఈసారి పవన్ ప్రజల కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యాడు. మాట మీద నిలబడేందుకు రెడీ అయ్యారు. పవన్ ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే పనిలో పడ్డారు. మరి పవన్ ను జనం ఈసారైనా నమ్ముతారా? ఆయన మాటలను నమ్మి ఓట్లువేస్తారా? అండగా నిలుస్తారా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.పవన్ మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం ఆయన మారిపోయాడని ప్రజల కోసం నిలబడుతాడన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి.

    -పవన్ మాట్లాడిన ఆ వైరల్ వీడియోను కింద చూడొచ్చు.