Pawan Kalyan Tweet: ఊరికే అనరు మహానుభావులు అని.. జనసేనాని పవన్ కళ్యాణ్ వేసే అడుగులు ఈ మధ్య చాలా వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. ఆయనకు రాజకీయాలు బాగా వంటబట్టాయని అర్థమవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ బాగా ఆరితేరారని.. రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు, ప్రత్యర్థుల వ్యూహాలను ఈజీగా గ్రహించేస్తున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవీ ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టినప్పుడు ఇలానే కుట్రలు, కుతంత్రాలు చేసి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసి పార్టీ మూసుకునేలా చేశారు. జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ పై కూడా అచ్చం వాటిని ప్రయోగించారు. కానీ మొక్కవోని పట్టుదల, దీక్ష, మొండి ధైర్యంతో పార్టీని కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రజలముందు అడ్డంగా నిలబడ్డారు. ఇన్నేళ్లలో ఎన్నో అవమానాలు భరించారు. ఎదురుదెబ్బలు తిన్నారు. మానసికంగా బాధను అనుభవించారు. అన్నింటిని ఎదురించి రాజకీయాల్లో ఇప్పుడు ప్రబల శక్తిగా అవతరించేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే రాజకీయాల్లో పెను మార్పులను పవన్ కళ్యాణ్ ముందే గ్రహించి తెలివిగా అడుగులు వేస్తున్నారు. తన జనసైనికులను అలెర్ట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ చేసిన రెండు ట్వీట్లు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పవన్ కళ్యాణ్ ను ఇప్పటిదాకా తిట్టిన వారు ఎవరు? ఇప్పుడు ఎందుకు పొగిడారని అందరూ ఆరాతీస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కొద్దిరోజులుగా వైసీపీ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నీచంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేశారు.
అయితే సడెన్ గా పవన్ కళ్యాణ్ పై వైసీపీ స్టాండ్ మారింది. ఇప్పుడు హఠాత్తుగా పవన్ ను పొగుడుతున్నారు. పవన్ ను మంచి చేసుకోవాలన్న వ్యూహంలోనే వైసీపీ ఇలా ట్రాక్ మార్చిందని.. ఈ విషయం పవన్ కు తెలియడంతోనే ఇలా ట్వీట్ చేశాని సమాచారం.
వైసీపీ తాజాగా కొత్త రాజకీయ వ్యూహకర్తను నియమించుకుంది. ఆయన వచ్చీ రాగానే మొదట ఆదేశించింది ఏంటంటే.. తెలుగు ప్రజల్లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను తిడితే వైసీపీకి మైనస్ అవుతుందని.. ఆయనకు అనుకూలంగానే ఉండాలని వైసీపీ అధిష్టానాన్ని సూచించాడట.. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు ఎలాగోలా తెలియడంతోనే ఆయన ఇలాంటి ట్వీట్ చేశారని తెలుస్తోంది.
ఇక బీజేపీ నేతలు ‘సీఎం’ క్యాండిడేట్ పై మాట మార్చిన వైనాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారని కొందరు అంటున్నారు. ఇప్పటివరకూ ‘సీఎం’ అని ఒప్పుకొని ఇప్పుడు మాట మార్చిన బీజేపీని నమ్మకూడదన్న కోణంలోనూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు.
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022
మొత్తంగా పవన్ కళ్యాణ్ ను తిట్టి.. ఇప్పుడు పొగుడుతున్న ఆ రెండు పార్టీలకే ఈ ట్వీట్ గుచ్చుకుందని.. పవన్ కళ్యాణ్ వారి బుట్టలో పడలేదన్న వాస్తవం వారికి ఈ ట్వీట్లతో తెలిసిందని స్పష్టమవుతోంది.