Pawan Kalyan: చంద్రబాబు కన్నీటి వ్యవహారం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం అవుతోంది. సాక్షాత్తు అసెంబ్లీలోనే కంటనీరు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టిస్తోంది. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో కన్నీరు కార్చడం మంచిది కాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలకే ఆయన కంట తడి పెట్టారని తెలుస్తోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధికార పార్టీ తీరును ఎండగట్టారు.

రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై అందరిలో ఆగ్రహం పెరుగుతోంది. సమస్యలపై స్పందించకుండా నేతల వ్యక్తిగత జీవితాలపై విమర్శలకు దిగడం ఈ మధ్య మామూలైపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతోనే రాజకీయాలంటే అందరికి అసహ్యం పెరుగుతోంది. ప్రతిపక్షాలను సైతం సమాన దృష్టితో చూడాల్సి ఉన్నా పార్టీల్లో వైఖరి మారుతోంది. చిన్న విషయాలను కూడా పెద్దగా చూస్తూ వారి ఆర్థిక మూలాలు దెబ్బతీసి కోలుకోకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
శాసనసభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన నేతలే ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడాన్ని అందరు ఖండిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అయినా వారిలో హుందాతనం కనిపించడం లేదు. ఫలితంగా బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. దీంతోనే చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారనే వాదన వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ కూడా అధికార పార్టీ వైసీపీ నేతల ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు విషయంలో వారి వైఖరి బాగా లేదని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడటంపై కొద్ది రోజులుగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నా అధికార పార్టీ మాత్రం పట్టించుకోవడం లేదు. తన వైఖరి మార్చుకోవడం లేదు. నేత ఎవరైనా వారిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగడం వారికి వెన్నతే పెట్టిన విద్య. ఎంత బూతులు మాట్లాడితే అంత బలం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే ఎదురొచ్చిన ఎవరిపైనైనా మాటల దాడికి దిగుతూ రెచ్చిపోతున్నారు. ఫలితంగా విమర్శలు ఎధుర్కొంటున్నారు.
Also Read: Chandrababu Crying: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?
కానీ నేతల్లో హుందాతనం పెరగాలి. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టకూడదు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప కుటుంబ సభ్యుల ప్రస్తావనకు వెళ్లకూడదు. అలా చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయనే కనీస మర్యాద కూడా తెలియదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?