Pawan Kalyan- PM Modi: మిగిలిన రాజకీయ నేతలు, సినిమా హీరోల కంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ప్రజల సమస్యలు, సామాజిక రుగ్మతలపై బాగా స్పందిస్తారు. కానీ అది ఎంతో అవసరమో అంతవరకే. అంతకు మించి వ్యాఖ్యానించరు. ఒకవేళ స్పందించాల్సి వస్తే మాత్రం పరిణితితో కూడిన కామెంట్స్ మాత్రమే చేస్తారు. అయితే పొలిటికల్ పంచ్ లు మాత్రం వేస్తారు. దీటుగా కౌంటర్లు ఇస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. తెగ పొగిడేయడం ఆసక్తికరంగా మారింది. ఓటమి చవిచూసినప్పుడు.. సంతృప్తికరమైన విజయం దక్కనప్పుడు చాలా మంది అసంతృప్తికి, ఆవేదనకు గురవుతారు. అటువంటి వారిని మనసుకు దగ్గరగా తీసుకున్నప్పుడు వారు ఎంతో స్వాంతనగా ఫీలవుతారు. ప్రధాని మోదీ అటువంటిదే చేయడంతో పవన్ అభినందనలతో ముంచెత్తారు. ఆయన చర్యలకు ఫిదా అయిపోయారు. మోదీ స్పందించిన తీరును గుర్తుచేస్తూ ట్విట్టర్లలో ప్రశంసల వర్షం కురిపించారు పవన్. సోషల్ మీడియాలో భారీ పోస్టుతో తన అభిమానాన్ని చాటుకున్నారు.
అసలేం జరిగిందంటే…
కామన్ వెల్త్ పోటీల్లో కుస్తీ పోటీల్లో మహిళా క్రీడాకారిణి పూజా గెహ్లట్ ఇండియా తరుపున హాజరయ్యారు. స్వర్ణ పతకాన్ని తృటిలో మిస్సయ్యారు.కాంస్య పతకంతో సరిపెట్టకున్నారు.దీంతో ఆమె దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. భావోద్వేగానికి మీడియా ముందే బోరున విలపించారు. ఇది భారతీయులను ఎంతో కదిలించింది. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఆమెను ఓదార్చడమే కాదు. వేడుక చేసుకోవాల్సిన సమయమంటూ ఆమెను ఊరడించారు. అయితే ప్రధాని ఊరడికి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ప్రధాని స్పందించిన వైనంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని నింపుతున్న స్ఫూర్తిని కొనియాడారు. ఇది ప్రతిఒక్కరిలోనూ కలగాలని ఆకాంక్షించారు. గతంలో చంద్రయాన్ 2 ప్రాజెక్టు ఆవిష్కరణ సమయంలో జరిగిన ఉదంతాలను గుర్తుచేశారు. నాడు ప్రాజెక్టు విఫలమైనప్పుడు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల వెన్నుతట్టి ప్రోత్సహించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
పరిణితితో కూడిన వ్యాఖ్యలు..
పరిణితితో కూడిన వ్యాఖ్యలతో ట్విట్టర్లో ప్రధానికి పవన్ అభినందనలు తెలిపారు. ‘విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కోకొల్లలుగా ఉంటారు. అదే అపజయం ఎదురైనప్పుడు ఓదార్చే వారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉండేవారే గొప్పగా కనబడతారు. ప్రధాని మోదీ అభినందనలు తెలపడం, శుభాకాంక్షలు తెలియడానికే పరిమితం కాలేదు.విజయాలను సాధించడానికి పరితపిస్తూ, శ్రమిస్తూ.. త్రుటిలో బంగారు పతకాన్ని దక్కించుకున్న వారిని భరోసా ఇవ్వడం నన్ను ఎంతో ఆకట్టుంది’ అంటూ ట్విట్టర్ లో పవన్ పేర్కొన్నారు.
గతానుభవాలను గుర్తుచేస్తూ..
గతంలో కూడా ప్రధాని మోదీ భావోద్వేగాలపై చూపించిన చొరవను పవన్ గుర్తు చేస్తున్నారు. వైఫల్యం చెందిన వారిని ప్రోత్సహించిన తీరును అభినందిస్తున్నారు. టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఇండియా హాకీ టీమ్ ఫైనల్ కు చేరలేదు.మన క్రీడాకారులు మైదానంలో విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో కూడా ప్రధాని ఇదే విధంగా స్పందించి క్రీడాకారులకు ఊరడించారు. వారికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. తండ్రిలా ధైర్యం చెప్పారు. అటు చంద్రాయన్ 2 ప్రాజెక్టుకు విఫలమైన సమయంలో భారత శాస్త్రవేత్తలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి దేశాల వారు సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు.అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చైర్మన్ శ్రీశివన్ ను గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ పరాజయాన్ని మరిచిపోండి. భవిష్యత్ పై దృష్టి పెట్టండి అని భుజం తట్టారు. వీటన్నింటినీ గుర్తుచేసిన పవన్ కళ్యాణ్.. మోదీలో ఉన్న మంచి గుణాలను ప్రస్తావిస్తూ ఆకాశానికి ఎత్తేశారు.
Also Read:Chikoti Praveen case – TRS Leaders: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ కన్ను