Analysis on Pawan Kalyan Speech: పవన్ కళ్యాణ్ మూడో ఫ్రంట్, సీరియస్ గా ప్రజల్లోకి..

  Analysis on Pawan Kalyan Speech : ఏపీలో ప్రతిపక్షం ఉందా? అనే మాట నుంచి.. ‘ఉంది’ అని నిలబడేందుకు ముందుకొస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రసంగం.. ఇప్పటివరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది.. పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ప్రజల మధ్య ఉంటే జనసేన పార్టీ ఖచ్చితంగా టీడీపీని తోసిరాజని ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగే చాన్స్ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం.. […]

Written By: NARESH, Updated On : September 24, 2021 6:15 pm
Follow us on

 

Analysis on Pawan Kalyan Speech : ఏపీలో ప్రతిపక్షం ఉందా? అనే మాట నుంచి.. ‘ఉంది’ అని నిలబడేందుకు ముందుకొస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రసంగం.. ఇప్పటివరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది.. పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ప్రజల మధ్య ఉంటే జనసేన పార్టీ ఖచ్చితంగా టీడీపీని తోసిరాజని ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగే చాన్స్ ఉంది.

నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం.. పరిషత్ ఎన్నికల్లో జనసేన గెలుపోటమిపై సమీక్షగా చెప్పొచ్చు. తిరిగి నామినేషన్ల ప్రక్రియ అనుమతించి ఉంటే కనీసం 1500 ఎంపీటీసీ, 50 వరకు జడ్పీటీసీ స్థానాలు గెలుచుకునే వాళ్లమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు 25శాతం పోలయ్యాయని పవన్ చెప్పుకొచ్చారు.

ఇది జనసేనకు కొండంత బలంగా పవన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీపై పవన్ విరుచుకుపడ్డారు. వైసీపీ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి గెలిచిందని.. ప్రతిపక్షాలను నామినేషన్లు వేయించకుండా దొంగదారిలో గెలిచిందని ఆరోపించారు. రాయలసీమలో ఎంతో మంది జనసైనికులు నామినేషన్లు వేయలేదని చెప్పుకొచ్చారు.

పవన్ ఆత్మవిశ్వాసం పరిషత్ ఎన్నికలతో పెరిగింది. టీఆర్ఎస్ కూడా తెలంగాణలో పోటీచేసినప్పుడు ఇలానే తక్కువ సీట్లు గెలిచిందని.. ఆ తర్వాత పుంజుకొని రాజ్యాధికారాన్ని సాధించిందని పవన్ ధీమాతో ఉన్నారు. పవన్ కనుక సీరియస్ గా ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా 2024 మూడో ఫ్రంట్ గా బలంగా నిలబడరని.. టీడీపీని పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఎదిగే చాన్స్ ఉంది. ఈ క్రమంలోనే పవన్ ప్రతినెల కార్యాచరణ ప్రకటించారు. పవన్ ఆలోచనలు.. ముందుకు వెళ్లే తీరు.. మూడో ఫ్రంట్ విషయంలో అడుగులపై ‘రామ్ టాక్’ స్పెషల్ వీడియోను కింద చూడొచ్చు.