https://oktelugu.com/

సోదరుల దారిలో నడవని పవన్

సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారిపోయారా ? కొన్నేళ్లుగా వీరి మధ్య ఉన్న రాజకీయ స్నేహానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా ? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కేసిఆర్ ను ప్రశంసిస్తోంది. సినిమా పరిశ్రమ అభివృద్దికి కేసిఆర్ ప్రకటించిన వరాలను మెచ్చుకుంటోంది. Also Read: అటు కేసీఆర్.. ఇటు బీజేపీ.. ఇరుక్కుపోయిన పవన్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. […]

Written By: NARESH, Updated On : November 25, 2020 12:14 pm
Follow us on

సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారిపోయారా ? కొన్నేళ్లుగా వీరి మధ్య ఉన్న రాజకీయ స్నేహానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా ? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కేసిఆర్ ను ప్రశంసిస్తోంది. సినిమా పరిశ్రమ అభివృద్దికి కేసిఆర్ ప్రకటించిన వరాలను మెచ్చుకుంటోంది.

Also Read: అటు కేసీఆర్.. ఇటు బీజేపీ.. ఇరుక్కుపోయిన పవన్

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. ట్వీటు వేయలేదు. ఆయన రాజకీయ నాయకుడు కదా? ఆయనకు వేరే పార్టీ వుందికదా? ఎలా వేస్తారు అని కొందరు అనుకుంటున్నారు. పైగా పవన్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ బంధాలు వున్న మెగాస్టార్ చిరంజీవినే ఈ టాలీవుడ్ వరాల కార్యక్రమానికి నడుంబిగించి కదిలారు. జనసేన పార్టీ నేత నాగబాబు సైతం ట్విట్టర్ లో శభాష్ కేసిఆర్ అన్నంత పని చేసారు. పార్టీ బంధాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ పెద్దలు అంతా ట్వీట్లు వేసారు.

2014లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఆ కూటమి తరపున తెలంగాణలో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై విమర్శలు కూడా చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్, కేసీఆర్ మధ్య సఖ్యత ఏర్పడింది.

పలుసార్లు కేసీఆర్, పవన్ కళ్యాణ్ భేటీ కూడా అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ సపోర్ట్ పవన్ కళ్యాణ్‌కే ఉంటుందని చాలామంది భావించారు. అయితే కేసీఆర్ మాత్రం వైసీపీకి తన మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి కేసీఆర్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య దూరం పెరిగిందనే టాక్ ఉంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేని పవన్ కళ్యాణ్… కేసీఆర్‌తో మళ్లీ రాజకీయ వైరం పెట్టుకునే అవకాశం లేదని చాలామంది భావించారు.

Also Read: పీసీసీ పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో రేవంత్‌..!

తాజాగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి కేసీఆర్‌ను రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతుందని అంతా భావించినా.. చివరకు వెనక్కి తగ్గింది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున నేరుగా ప్రచారం చేస్తారా లేదా అన్నది తెలియరాలేదు. ఒకవేళ ఆయన ప్రచారం చేపడితే.. ఆయన కచ్చితంగా కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను విమర్శించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్