Pawan Kalyan : దేశ రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపొయే విధంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ‘కౌలు రైతు భరోసా యాత్ర’.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు నష్టాలు వాటిల్లినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కానీ ,ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కానీ వాళ్ళని అసలు పట్టించుకోలేదు.. వరదలు , విపత్తులు వచ్చి పంటలు నష్టపోయి రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు ఏళ్లలో 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..ఇది గమనించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో ఆ రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు.

అందుకోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి , తన సొంత ఖర్చులతో సగం.. మిగిలిన సగం ఆ నిధికి వచ్చిన విరాళాలతో ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేపడుతానని మాట ఇచ్చాడు.. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 500 కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం అందించాడు.
అంతే కాకుండా ఆ కుటుంబాలలో ఉన్న పిల్లలను చదివించి ప్రయోజకులను చేసే బాధ్యతను కూడా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు..సొంత కుటుంబ సభ్యులే మనకి ఏదైనా కష్టం వస్తే మనకి ఎందుకులే అని తప్పించుకొని తిరుగుతున్న ఈరోజుల్లో, ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్లకి, తనకి ఓట్లు వేస్తారో లేదో గ్యారెంటీ కూడా లేని వాళ్లకి సహాయం చెయ్యడం కోసం ముందుకు రావడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఒక దేవుడే.
ఇలా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యలేదు.. ఇక ఈ కౌలు రైతు భరోసా యాత్ర కి కొనసాగింపుగా ఈ నెల 18వ తారీఖున పల్నాడు లో 286 కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం అందించబోతున్నాడు పవన్ కళ్యాణ్.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన జనసేన ప్యాక్ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ద్వారా మీడియా కి తెలియచేసాడు.. దీంతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 786 కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసాడు.. అంటే 7 కోట్ల 86 లక్షల రూపాయిలు అందించాడు అన్నమాట. ఇలా సొంత డబ్బులతో కష్టించి పనిచేసి వాటిని ప్రజలకు పంచుతున్న పవన్ కళ్యాణ్ లాంటి నేతలే తమకు కావాలని ప్రజలందరూ కోరుతున్నారు. పవన్ సీఎం అయితే ఇంకా మరిన్ని సేవలు అందిస్తాడని చెబుతున్నారు.