Pawan Kalyan- CM Jagan: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఏపీలో రాజకీయ దూకుడు పెంచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఊపి ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని.. ఏపీలో తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సుమారు 30 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించి ఉంటారని ఊహాగానాలు వస్తున్నాయి. కొంతకాలంగా బీజేపీతో మైత్రిపై నిరుత్సాహంగా ఉన్న జనసేనాని.. మోదీతో సమావేశం తర్వాత ఉత్సాహంగా కనిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రాబోతున్నాయని ప్రకటించారు. దీంతో మోదీ ఏపీలో పవన్‌కు ఫ్రీహ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రధాని పర్యటన ముగియక ముందే యుద్ధం షురూ..
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగియక ముందే.. జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. సీఎం జగన్ ప్రధానితో కలిసి విశాఖ బహిరంగ సభలో ఉండగానే పవన్ పోరాటం మొదలు పెట్టేశారు. జగనన్న మోసం హ్యాష్‌ట్యాగతో పవన్ కళ్యాణ్ ఫైట్ స్టార్ట్ షురూ చేశారు. దీంతో ప్రధాని మోడీ–పవన్ కళ్యాణ్ దాదాపు అరగంట సేపు భేటీతో జన సేనానిలో కొత్త జోష్ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. తాజాగా పవన్ ఫైట్ మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ‘‘జగనన్న ఇళ్లు..పేదలందరికీ కన్నీళ్లు’’ అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి తొలి పంచ్ అదిరిపోయాలా ఇచ్చారు జనసేనాని.
విశాఖ నుంచే యుద్ధం షురూ..
వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అని పవన్ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే దూకుడు పెంచారు. దాదాపు ఏడాదిగా జగన్ సర్కార్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం.. ఇంకోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో భవన నిర్మాణరంగ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. తాజాగా విశాఖ గర్జన పేరుతో సభ నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాలని భావించారు. కానీ జగన్ సర్కార్ దీనిని అడ్డుకుంది. పోలీసుల సహాయంతో పవన్‌ను రెండు రోజులు హోటల్‌లో నిర్బంధించింది. తర్వాత అక్కడి నుంచి మంగళగిరికి పంపించింది.

అవమానించబడిన చోటే నిలబడి తొడగొట్టిన పవన్..
ఎక్కడైతే తనను వైసీపీ సర్కార్ అవమానించిందో అక్కడే పవన్ ఏసీ సీఎం జగన్ అధిరిపోయే పంచ్ ఇచ్చారు. కాకతీళీయమో.. ప్లాన్ ప్రకారం జరిగిందో తెలియదు కానీ, వైసీపీ సర్కార్ అడ్డుకున్న చోటే.. పవన్ కళ్యాణ్‌ను ప్రధాని పిలిచి మరీ మాట్లాడారు. అది కూడా వైసీపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి.. జనసేనానితో మోదీ భేటీ అయ్యారు. దీంతో జగన్ సర్కార్ షాక్‌లో ఉంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. పది నిమిషాల భేటీ షెడ్యూల్ అరగంటకు పెరిగింది. దీంతో పవన్–మోదీ ఏం చర్చించారో తెలియక వైసీపీ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ అధికార వైసీపీకి మరో పంచ్ ఇచ్చారు. తనను అడ్డుకున్న విషాక నుంచి ఏపీ సర్కార్‌పై మరో యుద్ధం మొదలు పెట్టారు. ‘‘జగనన్న మోసం’ పేరుతో క్యాంపెయినింగ్ షురూ చేసి.. సవాల్ విసిరారు జనసేనాని.