Pawan Kalyan Varahi Yatra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయాలు వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు, కొంతమంది ఈ ఏడాది డిసెంబర్ నెలలో వస్తాయని, మరికొంత మంది అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వస్తాయని అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు ముందస్తుగా ఎవరి వ్యూహాలతో వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘వారాహి విజయ యాత్ర’.
కత్తిపూడి సభతో ప్రారంభమైన ఈ యాత్ర పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం లో సభలను ముగించుకొని ఇప్పుడు అమలాపురం కి చేరుకుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం వైసీపీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేసింది. వైసీపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిల్చింది.
బాగుండాలంటే.ఒక్కటే నినాదం, ‘హల్లో ఏపీ…బై బై వైసీపీ!” అంటూ ఆయన ఇచ్చిన స్లోగన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ స్లోగన్ ఇవ్వగానే దానిని రిపీట్ చేస్తూ అమలాపురం సభ దద్దరిల్లిపోయింది. ఇక సోషల్ మీడియా లో అయితే నిమిషాల వ్యవధిలోనే టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతూ , లక్షల కొద్దీ ట్వీట్స్ వేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
2014 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ఇలాగే ‘కాంగ్రెస్ హటావో..దేశ్ బచావో’ అనే స్లోగన్ ఇచ్చాడు. ఇది అప్పట్లో జాతీయ స్థాయిలో మీడియా కి ఎక్కి ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ లేటెస్ట్ స్లోగన్ కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నారు.మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపైన్ కి ఈ స్లోగన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది.