Pawan Kalyan Image Growing In Godavari Districts : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గోదావరి జిల్లాల్లో రాజకీయంగా చాలా మార్పులు సంభవించినట్టు తెలుస్తోంది. ఇటీవల వరదలకు గోదావరి ప్రాంతం విలవిలలాడింది. సీఎం జగన్ సైతం పర్యటించి వారికి స్వాంతన చేకూర్చారు.
గోదావరి జిల్లాల్లో చాలా మార్పులు వచ్చాయి. 2019లో జనసేన పోటీ చేసిన ఈ జిల్లాల్లో మూడో శక్తిగా ఎదగలేకపోయింది. కానీ గత సంవత్సరం నుంచి గోదావరి జిల్లాల్లో జనసేన బాగా బలోపేతమైంది.
గతంలో వైసీపీలో ఉన్న మహాసేన రాజేశ్, ఎంపీ రఘురామకృష్ణంరాజు, 30 ఇయర్స్ ఫృథ్వీ.. ఈ ముగ్గురిలో ఒక పోలిక ఉంది. పోయిన ఎన్నికల్లో వీళ్లు ముగ్గురు జగన్ కు బలమైన మద్దతుదారులుగా ఉండేవారు. జనసేనను, పవన్ కళ్యాణ్ ను బలంగా విమర్శించిన వారు.
ఒకప్పుడు దళిత నాయకులంతా జగన్ వెంట ఉండేవారు. కానీ ఇప్పుడు అదే దళిత నేతలంతా జనసేన వెంట నడుస్తున్నారు. మహాసేన రాజేశ్ జనసేనకు మద్దతుగా నిలవడమే దీనికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడంటూ రాజేశ్ పొగుడుతున్నాడు.
ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో నాగబాబుపై పోటీచేశారు. జనసేనను ఓడించారు. కానీ ఇప్పుడు ఇదే రఘురామ స్వయంగా పవన్ ను హ్యాట్సాఫ్ అంటూ పొగిడేశారు. నాడు తిట్టిన రఘురామ నేడు పొగిడేశాడు.
ఇక మూడోది సినీ నటుడు ఫృథ్వీ జగన్ పై ఈగవాలకుండా కాపు కాశారు. పవన్ ను తీవ్రంగా తిట్టాడు. కానీ ఇప్పుడు జగన్ ను తిడుతూ పవన్ కళ్యాణ్ ను పొగుడుతున్నాడు. ఈ మార్పులు ఏపీ ప్రజల్లో, నేతల్లో జనసేనపై, పవన్ కళ్యాణ్ పై మారిన అభిప్రాయానికి నిదర్శనం. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ఆదరణకు తార్కాణంగా చెప్పొచ్చు.
ఏపీలో చోటుచేసుకుంటున్న మార్పులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..