Jagan vs Pawan kalyan: రాజకీయాలంటేనే ఎత్తులు.. పైఎత్తులు.. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడలతోనే వెళితేనే విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల మాయలో పడిపోతే ఫెయిల్ అయిపోతారు. విమర్శల జడివానలో చిక్కి శల్యమవుతారు. అందుకే వాడివేడి మాటల దాడి చేయాలి. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయాలి. కానీ ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్న చోట ఏపీలోలాగా రాజకీయ వాతావరణం వేడిగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా కూడా అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. పొత్తుల రాజకీయాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు ఊతమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ సంచలనం సృష్టించాయి. అధికార వైసీపీని షేక్ చేశాయి.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సైతం దీనికి భయపడిపోయి ఇప్పుడు డైరెక్టుగా వీరిపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా రైతు భరోసా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని.. చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ ఎందుకంటూ పవన్ ను టార్గెట్ చేశారు.. రైతుల బతుకులను చంద్రబాబు గాలికి వదిలేస్తే అప్పుడు మాట్లాడడని దత్తపుత్రుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. పవన్ ను టార్గెట్ గానే తన రాజకీయం ఉంటుందని జగన్ స్పష్టం చేసినట్టైంది.
ఊరికే గమ్మున ఉండడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం తక్కువోడు కాదు కదా.. అందుకే ట్విట్టర్ వేదికగా జగన్ చేసిన విమర్శలపై గట్టి కౌంటర్లు ఇచ్చారు. జగన్ వీక్ నెస్ పై దెబ్బకొట్టాడు. శ్రీలం ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం అంటూ రాష్ట్రంలో జగన్ పాలనను టార్గెట్ చేశారు. ఏపీలో కూడా శ్రీలంక పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక టీడీపీతో పొత్తులపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం.. గడప గడపకి ఎమ్మెల్యేలని పంపడం కాదు చేయవలసిందని.. మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్ ను దూరం జరిపే ప్రయత్నం చేయండి’ అంటూ జగన్ వీక్ నెస్ పై పవన్ గట్టి దెబ్బ కొట్టారు.
పొత్తులు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్ , వైసీపీ బ్యాచ్ వీక్ నెస్ పై పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ముందు రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయాలని.. లేదంటే శ్రీలంకలా ఏపీ తయారువుతుందని జగన్ పాలనపై పవన్ చేసిన విమర్శలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. వైసీపీ సర్కారును డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని ప్రజలకు తెలియజెబుతూ.. జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తున్నట్టే కనిపిస్తోంది.
Also Read: AP Congress: జగన్ తో పోరాటానికే సై అంటున్న కాంగ్రెస్?
Recommended Videos: