https://oktelugu.com/

Janasena Alliance: జనంతోనే పొత్తు.. బీజేపీ, టీడీపీకి షాకిచ్చిన పవన్ కళ్యాణ్

Janasena Alliance పర్చూరు సభ సాక్షిగా ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. బీజేపీతో ఓవైపు పొత్తులో ఉన్నానంటూనే.. ఒంటరిగానే రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా పర్చూరులో కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున చెక్ లు పంపిణీ చేస్తూ ఏపీ రాజకీయాలను షేర్ చేసే ప్రకటన చేశారు. ‘పొత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదు’ అని ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బీజేపీతో కలిసి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 19, 2022 / 09:17 PM IST
    Follow us on

    Janasena Alliance పర్చూరు సభ సాక్షిగా ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. బీజేపీతో ఓవైపు పొత్తులో ఉన్నానంటూనే.. ఒంటరిగానే రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా పర్చూరులో కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున చెక్ లు పంపిణీ చేస్తూ ఏపీ రాజకీయాలను షేర్ చేసే ప్రకటన చేశారు. ‘పొత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదు’ అని ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    నిజానికి బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఏపీలో పొత్తు పెట్టుకొని ముందుకెళుతున్నారు. కానీ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను ‘ముఖ్యమంత్రి అభ్యర్థిగా’ గుర్తించలేదు. ఇక జీవీఎల్ సహా కొంత మంది బీజేపీ నేతలు అప్పుడే సీఎం అభ్యర్థిత్వంపై చర్చ అనవసరం అంటూ పవన్ కళ్యాణ్ పై దాట వేశారు.

    ఇక మహానాడు తర్వాత టీడీపీలో కూడా వచ్చిన ఊపుతో పొత్తులపై పచ్చపార్టీ ఆసక్తి చూపించలేదు. జనసేనను లైట్ తీసుకొని టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారు.. జనసేనకు అంత బలం లేదంటూ మీడియా చానెల్స్ లో విష ప్రచారం చేస్తూ మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఇక ఏపీ రాజకీయాల్లో ప్రజలతోనే తేల్చుకునేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకొని ఏపీ రాజకీయాలను శాసించాలని.. పొత్తు కోసం తన వద్దకే పార్టీలు వచ్చేలా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఈ దసరా నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా బస్సు యాత్రను ప్రకటించారు.

    ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయాలు షేక్ అయ్యాయి. అధికార వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ముందుకెళుతున్నారు. తన పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపని బీజేపీ, టీడీపీలకు గట్టి షాక్ ఇచ్చారు. ‘తన పొత్తు జనంతోనే’ స్పష్టం చేశారు. తద్వారా ఇక ఏపీ రాజకీయాల్లో తనకు పొత్తుల అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఎన్నికల సమరంలోకి దిగుతానని సంచలన ప్రకటన చేశారు.

    పవన్ కళ్యాన్ చేసిన ఈ ప్రకటనతో బీజేపీ, టీడీపీకి షాకింగ్ లా మారింది. కేంద్రంలో అధికారంతో బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ బెట్టు చేస్తున్న వేళ.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ ఏకం చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తు లేదని.. ‘జనంతోనే పొత్తు’ అని చేసిన ప్రకటన ఆ రెండు పార్టీలకు గట్టి షాకిచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరణ అభిమానం చూరగొని.. క్షేత్రస్తాయిలో జనసేనను బలోపేతం చేసి ఒక బలమైన పార్టీగా ఏపీలో ఎదిగేందుకు స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రజల్లోనే పవన్ కళ్యాణ్ తేల్చుకునేందుకు రెడీ అవ్వడం విశేషం.