Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే ‘తానొక కమ్యూనిస్టు’ అని చెప్పుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక తనలో కమ్యూనిస్టు భావాలున్నాయన్నారు. అంతేకాదు.. పోయిన ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఆది నుంచి పవన్ లో విప్లవభావాలు ఎక్కువే. అందుకే ఆయన చూసే చూపు కూడా చాలా డిఫెరెంట్ గా ఉంది. మనందరం భక్తితో చూసే ‘సమతామూర్తి రామానుజం’లోనూ ఓ విప్లవకారుడిని గుర్తించాడు పవన్ కల్యాణ్. అదే ఆయన స్పెషల్.
దేశాన్ని పాలించే ప్రధాని మోడీ అంతటివారు కూడా హైదరాబాద్ వచ్చి రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ దేవాలయాన్ని సందర్శించాక దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా ప్రముఖులు రామానుజ దేవాలయానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తాజాగా వచ్చారు.
అయితే అందరూ భక్తిభావంతో చూస్తున్న రామానుజ చరిత్రను పవన్ తవ్వితీశారు. ఆయనలోని విప్లవకారుడిని ఈ కమ్యూనిస్టు పవన్ వెలికితీశారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘రామానుజాచార్యులు తొలి విప్లవకారుడు’ అని జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన ప్రకటన సంచలనమైంది. నిజానికి రామానుజాన్ని ఒక దేవుడిగా .. ఒక గొప్ప సన్యాసిగా మాత్రమే అందరూ కొనియాడారు. హిందూ మత వ్యాప్తి చేసిన గురువుగా చూశారు.
కానీ పవన్ మాత్రమే ఆయన చరిత్ర చదివి మరీ ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ మాటలు మాట్లాడడం విశేషం. అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేనప్పుడు వారితో ఆలయ ప్రవేశం చేయించిన గొప్ప నాయకుడు రామానుజచార్యులు అని కొనియాడారు. మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే.. నిలదీసే హక్కు మనుకుందని పవన్ ఎమోషనల్ అయ్యారు. రామానుజాచర్య స్ఫూర్తితో ముందుకు వెళుతానని పవన్ చెప్పడం గమనార్హం.
అందరూ రామానుజాచార్యను మతం కోణం.. హిందుత్వవాదిగా గుర్తిస్తుంటే.. పవన్ మాత్రం విప్లవకారుడిగా.. మతంలోని లోపాలను ప్రశ్నించిన గొప్ప మానవతావాదిగా చూడడం విశేషం. అందరూ చూసే కోణంలో కాకుండా చరిత్రను చదివి మరీ పవన్.. రామానుజం గురించి కొత్త విషయాలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.