జగన్‌ ఇమేజీని పెంచేసిన పవన్‌ కల్యాణ్‌

అధికార పక్షమంటే ఏ ప్రతిపతిక్షానికైనా పీకల్దాకా కోపం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా దానిని వ్యతిరేకించడం పరిపాటి. అది రాష్ట్ర రాజకీయాల్లో గానీ.. దేశ రాజకీయాల్లో గానీ.. కామన్‌. ఏపీలో అయితే జగన్‌ మీద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉండే కోపం అంతాఇంతా కాదు. ‘జగన్‌రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వను. నువ్వు ముఖ్యమంత్రి కాలేవు’ అని ఎన్నికలకు ముందు వార్నింగ్‌లు ఇచ్చారు. Also Read: ఆ ఆలయాలను పునర్నిర్మిస్తాం: జగన్‌ ప్రభుత్వం కీలక […]

Written By: Srinivas, Updated On : January 7, 2021 10:59 am
Follow us on


అధికార పక్షమంటే ఏ ప్రతిపతిక్షానికైనా పీకల్దాకా కోపం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా దానిని వ్యతిరేకించడం పరిపాటి. అది రాష్ట్ర రాజకీయాల్లో గానీ.. దేశ రాజకీయాల్లో గానీ.. కామన్‌. ఏపీలో అయితే జగన్‌ మీద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉండే కోపం అంతాఇంతా కాదు. ‘జగన్‌రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వను. నువ్వు ముఖ్యమంత్రి కాలేవు’ అని ఎన్నికలకు ముందు వార్నింగ్‌లు ఇచ్చారు.

Also Read: ఆ ఆలయాలను పునర్నిర్మిస్తాం: జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే ప‌వ‌న్ శాపాలు జ‌గ‌న్‌కు ఆశీస్సులే అయ్యాయి. ఎవ‌రెన్ని విధాలుగా అడ్డుకున్నా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజ‌ల ఆశీస్సుల‌తో జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యారు. జ‌గ‌న్‌ను ఏదో చేయాల‌నుకున్న వాళ్లే ప్రజ‌ల తిర‌స్కర‌ణ‌కు గురయ్యారు. అయితే.. అదేంటో ఎప్పుడూ జగన్‌పై పీకల్లోతు కోపంతో ఉండే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కసారిగా యూటర్న్‌ కానీ తీసుకున్నారా ఏంటి అన్నట్లుగా ఒక ప్రకటన విడుదలైంది.

ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ ప్రక‌ట‌న రిలీజ్‌ చేశారు. అందులో ఏముందంటే.. ‘మీరు ఎంత శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్‌ఫేర్‌ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయ‌మూర్తులు, న్యాయ‌మూర్తుల బ‌దిలీలు జ‌రిగాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ జ‌స్టిస్‌లు కూడా బ‌దిలీ అయ్యారు. అయితే ఏపీ చీఫ్ జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి బ‌దిలీ వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రమేయం ఉంద‌ని సీపీఐ జాతీయ కార్యద‌ర్శి నారాయ‌ణ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

Also Read: స్పృహ తప్పిన అఖిల.. ఇంకా పరారీలోనే భార్గవ్‌

అయితే.. ఇప్పుడు జగన్‌ రాసిన లేఖ వల్లనే ఈ న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రస్తావించడం గమనార్హం. జ‌గ‌న్‌ను వెట‌కారం చేయ‌డానికే అయినా.. ముఖ్యమంత్రి ప‌లుకుబ‌డిని పెంచిన‌ట్టే అవుతుందంటున్నారు నెటిజన్లు. ప‌దేపదే జ‌గ‌న్ సర్కార్‌పై న్యాయ‌స్థానాలు మొట్టికాయ‌లు వేస్తోందంటూ సంబ‌రంగా మాట్లాడిన వాళ్లంతా, జ‌గ‌న్ లేఖతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అయితే.. అనుకోకుండా పవన్‌ కల్యాణ్‌ జగన్‌ ఇమేజ్‌కు మరింత హైప్‌ తెచ్చినట్లే అయింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్