Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ లాజిక్ తో కొడుతున్నాడు. కొడితే అలా ఇలా కాదు.. ఏనుగు (జగన్) కుంభస్థలాన్నే గట్టిగా కొట్టేస్తున్నాడు. సమయం సందర్భం చూసి.. లాజిక్ లు, ఆధారాలతో సహా జగన్ ను కొడుతున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిన్నటికి నిన్న వరుసగా ఎనిమిది ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏపీలోని జగన్ సర్కార్ తీరును కడిగిపారేశాడు. ఏపీలో ఎయిడెడ్ పాఠశాలలను అమ్ముకుంటున్న జగన్ సర్కార్ ‘అమ్మఒడి.. అమ్మకానికో బడి’ అంటూ పవన్ చేసిన ట్వీట్ వార్ ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.
ఇప్పుడా ఘటన మరవకముందే మరో కథతో పవన్ మన ముందుకు వచ్చాడు. ‘నారింజ పండ్లు అమ్ముతూ పాఠశాల నిర్మించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత హరేకల హజబ్బా స్ఫూర్తిదాయక ప్రస్థానం’ అంటూ కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి కథను పవన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు.
Also Read: అప్పుడు ‘అమ్మ ఒడి’.. ఇప్పుడు ‘అమ్మకానికో బడి’
ఇప్పుడీ కథ వైరల్ అయ్యింది. హజబ్బా అనే పండ్ల వ్యాపారిని ఒక విదేశీయుడు నారింజ పండ్లు కిలో ఎంత అని ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక హజబ్బా తన తరువాతి తరం అలా బాధపడవద్దని ఏకంగా స్కూల్ కట్టి ఇంగ్లీష్ బోధన చేపట్టాడు. అతడి గొప్పతనాన్ని వివరిస్తూ ఏపీ సర్కార్ ‘బడుల అమ్మకాల’పై పవన్ గట్టి పంచ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నో ఉదాహరణలు, ఉపమానాలతో ఏపీ సర్కార్ ను కడిగేస్తున్న తీరు చర్చనీయాంశమైంది.
నారింజ పండ్లు అమ్ముతూ పాఠశాల నిర్మించారు
పద్మ శ్రీ పురస్కారగ్రహీత హరేకల హజబ్బా స్ఫూర్తిదాయక ప్రస్థానం#HarekalaHajabba pic.twitter.com/LVrUgBLxk0
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2021