Akhanda Movie Dialogues: తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే పిచ్చి. ముఖ్యంగా మాస్ సినిమాలంటే తెలుగు అభిమానులకు వ్యసనం. కానీ, కరోనా వచ్చాక, నిజమైన మాస్ సినిమా తగలలేదు. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత బి,సి సెంటర్లకు ఇంతవరకు సరైన ఒక్క సినిమా పడలేదు. మధ్యలో కొన్ని కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్లు వచ్చినా.. వాటిల్లో యాక్షన్ తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ అన్నట్లు ఉన్నాయి ఆయా సినిమాల అవుట్ ఫుట్.

నిజమే.. యాక్షన్ అందరికీ సెట్ కాదు. బాలయ్య లాంటి హీరోకే అది చెల్లింది. పైగా బాలకృష్ణ – బోయపాటిల కాంబోలో సినిమా అంటే.. ఇక బిసి ప్రేక్షకులకు అది పెద్ద పండుగ. ఎలాగూ గత కొన్ని నెలలుగా విలవిలలాడుతున్న బి,సి థియేటర్లన్నీ మళ్ళీ కళకళలాడటానికి ముస్తాబు అవుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా రిలీజ్ కానుంది.
నిన్న రిలీజ్ అయిన అఖండ థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మొత్తానికి ‘అఖండ’ సింగిల్ స్క్రీన్స్ ను ఒక ఊపు ఊపుతుందని బయ్యర్లకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందుకే, బి,సి థియేటర్లను రెడీ చేస్తున్నారు.
Also Read: డైరెక్టరే భయపడుతుంటే.. ఇక యూనిట్ మాటేమిటి ?
మరోపక్క అఖండ సినిమాలోని డైలాగులను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అఖండ సినిమాలో హైలైట్ గా కానున్న బాలయ్య డైలాగ్స్ ఇవే.
1) ఏయ్, అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా ? పట్టిసీమ తుమా ? పిల్ల కాలువ.. కొడకా
2) ఒక సారి నేను డిసైడ్ అయి బరిలోకి దూరితే.. ఇక బ్రేకులు లేని బుల్డోజర్ నే.. తొక్కి పారదొబ్బుతా
3) ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాశనం, దైవ శాసనం.
4) లెఫ్ట్ రైటా టాపా బాటమా… ఎటు నుండి ఎక్కుపెట్టి గోకినా… కొడకా… ఇంచ్ బాడీ దొరకదు…
5) మీకు సమస్య వస్తే దండం పెడతారు… మేము ఆ సమస్యకే పిండం పెడతాం… బోత్ ఆర్ నాట్ సేమ్..!
ఇలా సాగాయి బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ లు. ఇప్పుడు ఈ డైలాగ్ లను మీమ్స్ రాయుళ్లు తెగ పేరడీ చేసి మీమ్స్ వదులుతున్నారు. మొత్తమ్మీద బి,సి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా రానుంది. పాండమిక్ పీరియడ్ పోయినా ప్రేక్షకులు ధియేటర్ల వరకు రావడం లేదు. అయితే, ప్రేక్షకులను థియేటర్స్ వరకు తీసుకువచ్చే సినిమా అఖండ.
Also Read: ‘అఖండ’ హైఓల్టేజ్ గర్జన.. రెచ్చిపోయిన బాలయ్య..రచ్చరచ్చే
నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.