
Pawan Kalyan : జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమోషనల్ గా మాట్లాడారు. 10 ఏళ్ల తన రాజకీయ పార్టీ ప్రస్థానం ముందుగా గుర్తు చేసుకున్నాడు. తాను పార్టీ పెట్టినప్పుడు కేవలం ఒక్కడినే అని.. అప్పుడు ఎవరూ లేరని పవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులకు ఆరాధ్యుడిగా ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తనకు 1000 కోట్ల ఆఫర్ ను కేసీఆర్ ఇచ్చాడని ఒక పత్రికాధినేత ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సంచలన కౌంటర్ ఇచ్చాడు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. అసలు డబ్బుపై తనకు వ్యామోహం లేదని.. రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తిని తాను అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తాను 22 రోజులు ఒక సినిమా కోసం కాల్షీట్లు ఇచ్చానని.. దాని కోసం తనకు రోజుకు 2 కోట్ల చొప్పున పారితోషికం ఇస్తున్నారని.. అలాంటి రేంజ్ నాది అని.. 1000 కోట్లకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
కులాల కోసం కొట్టుకోవద్దంటూ సభకు హాజరైన ప్రజలు, యువతకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు. కులాల కోసం మనం మనం కొట్టుకుంటుంటే అగ్రవర్ణాలు చోద్యం చూస్తున్నాయని.. వైసీపీ కులాల మధ్య కొట్లాట పెట్టి విభజిస్తోందంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాపుల ఆరాధ్య దైవుడు అయిన వంగవీటి రంగాను తాను చిన్నప్పుడు మా ఇంట్లో కలిశానని..ఆయనకు చాయ్ కూడా తన చేతితో అందించానని పవన్ కళ్యాణ్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కాపు అయిన రంగా కమ్మ మహిళను చేసుకున్నాడని.. కాపు+కమ్మలకు పుట్టిన రాధా ఏ కులం అంటూ పవన్ నిలదీశాడు. కమ్మ, కాపులు, రెడ్డిలు, బీసీల నేతలంతా ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్నారని.. కాబట్టి కులాల కోసం కొట్టుకోవద్దంటూ పవన్ ప్రజలకు హితవు పలికారు.
తాను ఒక కులంలో పుట్టినా కులం కోసం నిలబడాలని ఉండదని.. అన్ని కులాలు, మతాలు నావేనని.. అందరికీ న్యాయం చేస్తానని పవన్ అన్నారు. ఒక్క కులంతో తనకు అధికారం రాదని.. అందరినీ ఒక్కతాటిపైకి తేవడమే లక్ష్యమన్నారు. మొత్తంగా కులాల కుంపట్లను చల్లార్చే ప్రయత్నాన్ని పవన్ ఈ సభావేదికపై చేస్తున్నారు.