Pawan Kalyan CM Candidate: ఏపీలో అధికార వైసీపీని ఓడించాల్సిందే.. అలా ఓడించాలంటే బీజేపీని ఒప్పించాల్సిందే. ఇదే టార్గెట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఎలాగైనా సరే బీజేపీని ఒప్పించి టీడీపీని కలుపుకొని అధికార వైసీపీని చిత్తు చేయాలని చూస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రస్తుతం వైసీపీతో స్నేహంగానే ఉంది. కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి వైసీపీతో ఏపీ బీజేపీ పోరాడుతోంది. జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను మాత్రం ఏపీ బీజేపీ అంగీకరించే అవకాశాలు లేవు. ఎందుకంటే టీడీపీ ఇదివరకే ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకొని మోసం చేసి బయటకు వచ్చేసింది. మోడీ టార్గెట్ గా చంద్రబాబు ఎంతలా గాయి చేశారో అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని.. దేశమంతా తిరిగి చంద్రబాబు చేసిన హంగామా.. మోసాన్ని బీజేపీ మరిచిపోలేదు. అందుకే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని అస్సలు బీజేపీ శ్రేణులు హర్షించడం లేదు.
ఇక పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తే ఏం చేయాలన్న దానిపై కూడా ప్లాన్ బిని బీజేపీ రెడీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వకుండా జనసేన+బీజేపీ సగం సీట్లు, టీడీపీ సగం సీట్లు తీసుకొని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అంగీకరిస్తేనే ఆ పార్టీతో వెళ్లాలని బీజేపీ షరతు పెట్టడానికి రెడీ అయ్యింది.
టీడీపీ ఈ పొత్తును కొనసాగించాలంటే సీఎం సీటును వదలుకోవాలి. చంద్రబాబు దీనికి అంగీకరించే పరిస్థితి ఉండదు. పెద్ద పార్టీగా ముఖ్యమంత్రి సీటును త్యాగం చేయడానికి టీడీపీ అస్సలు ఒప్పుకోదు. సో ఈ పొత్తు పొడవదు. అందుకే బీజేపీ ఈ ప్రతిపాదనను చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
ఇటు పవన్ కళ్యాన్ మాటను తీసివేయకుండా.. అదే సమయంలో టీడీపీతో కలిసి సాగకుండా బీజేపీ ప్లాన్ వేసింది. టీడీపీ దీనికి అంగీకరిస్తే పవన్ ను ముందుపెట్టి రాజకీయం నడిపించాలని బీజేపీ యోచిస్తోంది. టీడీపీ ఇలా సీఎం సీటును వదులకునే అవకాశాలు అయితే అస్సలు లేవు. వైసీపీని ఓడించడానికి అంగీకరిస్తే మాత్రం తన గొయ్యిని తానే తవ్వుకొని టీడీపీని చంద్రబాబు దెబ్బతీసినవారు అవుతారు. బీజేపీ, జనసేనను లేపినట్టు అవుతుంది. మరి దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
Also Read:Pawan Kalyan: బీజేపీపైనే ఏపీ భవిష్యత్ రాజకీయాలు.. పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తాడా?