https://oktelugu.com/

pawan kalyan Janasena : వైసీపీ విముక్త ఏపీనే లక్ష్యం.. సమయాన్ని బట్టి పొత్తులు.. కేసీఆర్ ను ఫాలో అవుతానన్న పవన్ కళ్యాణ్

pawan kalyan Janasena కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అధికార మదంతో విర్రవీగుతున్న వైసీపీ మెడలు వంచాలి. ఈ రెండే టార్గెట్లు.. పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు ఐదు కీలక తీర్మాణాలు ప్రకటించారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ వ్యూహాలను పాటిస్తామని చెప్పారు.  అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ శపథం చేశారు. వైసీపీ విముక్త ఏపీనే జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ సంచలన తీర్మానం చేశారు. ఓట్లు చీలనివ్వకుండా సమయాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2022 / 07:17 PM IST
    Follow us on

    pawan kalyan Janasena కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అధికార మదంతో విర్రవీగుతున్న వైసీపీ మెడలు వంచాలి. ఈ రెండే టార్గెట్లు.. పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు ఐదు కీలక తీర్మాణాలు ప్రకటించారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ వ్యూహాలను పాటిస్తామని చెప్పారు.  అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ శపథం చేశారు. వైసీపీ విముక్త ఏపీనే జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ సంచలన తీర్మానం చేశారు. ఓట్లు చీలనివ్వకుండా సమయాన్ని బట్టి పొత్తులుంటాయని క్లియర్ కట్ మెసేజ్ పంపారు. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. పొత్తులపై విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై అప్పుడే నిర్ణయిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని మరోసారి కుండబద్దలు కొట్టారు. టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

    -కేసీఆర్ వ్యూహాలు పాటిస్తానంటున్న పవన్ కళ్యాణ్
    కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పాటిస్తామని.. ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులను బట్టి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. తమ స్ట్రాటజీ తమకు ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఏపీకి హానికరమని అన్నారు.

    -పీఏసీ కమిటీ భేటిలో మొత్తం 5 తీర్మానాలు
    వైసీపీ విముక్త ఏపీ, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు నిజమైన రాజకీయ సాధికారత , వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వెనుకబడిన ముస్లింల ఆర్థిక పరిపుష్టి, దివ్యాంగుల సంక్షేమం.. సామాజిక భరోసా జనసేన బాధ్యత మిగిలిన నాలుగు తీర్మానాలు..

    2019 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడిస్తారని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకునే ప్రక్రియను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.

    జనసేన జీరో బడ్జెట్ అంటే అర్థం వేరే విధంగా చేసుకుంటున్నారని.. అభివృద్ధి సాధించేలా తమ ప్రణాళికలు ఉంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పెట్టుబడికి అనుకూలంగా లేని రాయలసీమలో పరిశ్రమ పెట్టాలంటే వైసీపీకి కప్పం కట్టే పరిస్థితులు ఉన్నాయి.. కట్టకుండా దాడులు చేస్తున్నారని విమర్శించారు. అందుకే సీమ వెనుకబడుతోందన్నారు.

    ఇక పవన్ కళ్యాణ్ ఈ భేటిలో వైసీపీకి, టీడీపీకి కొమ్ము కాయమని..మూడో ప్రత్యామ్మాయం కోసం పాటు పడుతామన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి ఏపీలో సొంతంగా ముందుకెళుతామని.. పొత్తుల విషయంలో పవన్ క్లారిటీగా ఉన్నారని అర్థమవుతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యమంటూ ఏకంగా రాజకీయ తీర్మానం చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.