https://oktelugu.com/

Pawan Kalyan and Nagababu: పవన్ కళ్యాణ్, నాగబాబూ ఇద్దరి టార్గెట్ అదే

Pawan Kalyan and Nagababu: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అన్నాదమ్ములు హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్, జనసేన కీలక నేత నాగబాబు ఏపీలో పర్యటనలతో పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. జనసేనకు ఎక్కడలేని ఊపు తెస్తున్నారు. ఇద్దరూ ప్రజా సమస్యలపై, పార్టీ బలోపేతంపై ముందుండి వ్యవహరిస్తున్న తీరుతో జనసేనలో జోష్ నెలకొంది. ఏపీలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. అధికార వైసీపీపై […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2022 / 12:43 PM IST
    Follow us on

    Pawan Kalyan and Nagababu: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అన్నాదమ్ములు హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్, జనసేన కీలక నేత నాగబాబు ఏపీలో పర్యటనలతో పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. జనసేనకు ఎక్కడలేని ఊపు తెస్తున్నారు. ఇద్దరూ ప్రజా సమస్యలపై, పార్టీ బలోపేతంపై ముందుండి వ్యవహరిస్తున్న తీరుతో జనసేనలో జోష్ నెలకొంది.

    Pawan Kalyan and Nagababu

    ఏపీలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. అధికార వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ దాన్ని అందిపుచ్చుకోవడం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు అన్నాదమ్ములు ఇద్దరూ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

    Also Read: Andhra University: మసకబారుతున్న ఏయూ ప్రతిష్ట.. వైసీపీ నేతలా వ్యవహరిస్తున్న వైస్‌ చాన్సలర్‌

    ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న చోట ఆ ఓటు బ్యాంకను జనసేనకు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు టీడీపీకి కంచుకోటగా మారాయి. అయితే పోయిన ఎన్నికల్లో అవి టీడీపీపై వ్యతిరేకతతోనే వైసీపీపై గెలిపించాయి. టీడీపీకి ప్రత్యామ్మాయం దొరికితే ఉత్తరాంధ్ర ప్రజలు అటు మరలే అవకాశం ఉంది. ఆ బాధ్యతను జనసేన తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.అందుకే దీన్ని క్యాష్ చేసుకోవడానికి నాగబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి అటు ప్రజలను.. ఇటు పార్టీని విస్తరిస్తూ ఉత్తరాంధ్రలో బలోపేతం చేసేలా కీలక చర్యలు తీసుకున్నారు.

    Pawan Kalyan and Nagababu

    ఇక ఎన్టీఆర్ పుట్టిన విజయవాడ, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో తెలుగుదేశానికి గట్టి పట్టి ఉంది. ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడ నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతంపై తరుచుగా పర్యటిస్తూ జనసేనను విస్తరిస్తూ నాయకత్వాన్ని బలంగా తీర్చిదిద్దదుతున్నాడు.

    వీరిద్దరు అన్నాదమ్ముల టార్గెట్ ఒక్కటే.. వైసీపీని ఎదురించలేకపోతున్న టీడీపీ ఓటు బ్యాంకును.. ఆ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేనకు మళ్లించడం.. ఇప్పుడు పవన్, నాగబాబు అదే పనిచేస్తున్నారు. ఇద్దరూ ఏపీలోని కీలకమైన.. టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో పర్యటించడం వెనుక అసలు ఉద్దేశం ఇదేనంటున్నారు. మరి టీడీపీ ఓటు బ్యాంకు కనుక జనసేనకు మరలితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కొండంత బలంగా మారుతుంది. జనసేన అధికారానికి చేరువ అవుతుంది. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

    Also Read: Jeelugu Kallu: ఏపీలో స్వల్ప ధరకే ఆర్గానిక్ మద్యం.. తాగేటోళ్లకు తాగినంత.. ఎగబడుతున్న జనాలు
    Recommended Videos


    Tags