బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

సొంత నిర్ణయమో లేక ఎవరిదైన సలహానో… పవన్ బీజేపీతో దోస్తీ కట్టాడు. దాని వలన కలిగే ఫలితాలు..ఎదురయ్యే పర్యవసానాలు ఆలోచించారో లేదో… కానీ ఆయన బీజేపీ పంచన చేరడం జరిగింది. బీజేపీతో టీడీపీ విడిపోయాక మోడీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ మోడీకి జైకొట్టడం వలన, పవన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అనే భావన ప్రజల్లో కలుగజేశారు. పవన్ బీజేపీ పార్టీతో మిత్రునిగా మారడానికి జగన్ విజయమే కారణం. తన భవిష్యత్తును కూడా పక్కన పెట్టి […]

Written By: Neelambaram, Updated On : June 24, 2020 10:15 am
Follow us on


సొంత నిర్ణయమో లేక ఎవరిదైన సలహానో… పవన్ బీజేపీతో దోస్తీ కట్టాడు. దాని వలన కలిగే ఫలితాలు..ఎదురయ్యే పర్యవసానాలు ఆలోచించారో లేదో… కానీ ఆయన బీజేపీ పంచన చేరడం జరిగింది. బీజేపీతో టీడీపీ విడిపోయాక మోడీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ మోడీకి జైకొట్టడం వలన, పవన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అనే భావన ప్రజల్లో కలుగజేశారు. పవన్ బీజేపీ పార్టీతో మిత్రునిగా మారడానికి జగన్ విజయమే కారణం. తన భవిష్యత్తును కూడా పక్కన పెట్టి పవన్ జగన్ ని కట్టడి చేయాలని కసితో, బీజేపీ మిత్ర పక్షం అయ్యారు .

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

మరి పవన్ కోరుకున్నట్లు బీజేపీ అండతో జగన్ పై ఆయన ఆధిపత్యం సాధించగలుగుతున్నాడా అంటే అదీ లేదు. రాజధాని అమరావతి నుండి ఎలా మారుస్తారు..అది జరగనివ్వను అని పవన్ శపథం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలో అంశం, అందులో మేము జోక్యం చేసుకోము..అని కేంద్రం చెప్పడంతో పవన్ కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. జగన్ బీజేపీతో సన్నితంగా ఉంటుండగా…పవన్ కి ప్రత్యేక గుర్తింపు ఏమి లేదు. జనసేన బీజేపీతో చేరింది కాబట్టి వారు జగన్ ని టార్గెట్ చేస్తారు అనుకోవడం అవివేకమే అవుతుంది. భవిష్యత్తులో బీజేపీ సంపూర్ణ విజయం సాధించకపోతే జగన్ లాంటి నాయకుడి అండ, వారి ఎంపీల మద్దతు వారికి అవసరం అవుతుంది.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

రెండు నాల్కల ధోరణి గల బాబుని మోడీ నమ్మలేని పరిస్థితి. కాబట్టి జగన్ తో సన్నితంగా ఉండడం వలన వారికి కలిసొచ్చే అంశమే. ఇక ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ పార్టీ వలన పవన్ కి వచ్చే ప్రయోజనం ఏముంది?. పవన్ వలన రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి లాభమే కానీ.. బీజేపీ వలన పవన్ కి కొత్తగా ఒనగూరే ప్రయోజం ఏమి లేదు. దీనికి తోడు బీజేపీ మిత్ర పక్షం అని చెప్పుకోవడం వలన, వారిని ప్రశ్నించ లేని పరిస్థితి. గత బడ్జెట్ లో ఏపీకి కనీస కేటాయింపులు, సహకారం లభించకపోయినా ఆయన భేష్ అని పొగిడారు. ఇది ప్రజల్లో తన ఇమేజ్ కి డామేజ్ చేసే అంశమే. రేపు బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారు.ఒకవేళ గతం కంటే కొన్ని మెరుగైన సీట్లు గెలిచినా ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏవిధంగా చూసిన బీజేపీ పవన్ కి భారమే కానీ.. బలం కాదు.