Pawan Kalyan vs Jagan : పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. తనని తానే కూల్చుకున్న జగన్

Pawan Kalyan vs Jagan : జనసేనాని పవన్ కళ్యాన్ తో పెట్టుకొని ఇప్పుడు సీఎం జగన్ తొలిసారి తనను తానే కూల్చేసుకున్నాడు. జనసేన సభకు వ్యవసాయ భూములు ఇచ్చారనే కోపంతో ఇప్పటం గ్రామంలోని రైతుల ఇళ్లను కూలగొట్టి రోడ్డు వెడల్పు అంటూ వైసీపీ సర్కార్ దమనకాండకు దిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అయితే ఇప్పటంలో ప్రజల ఇళ్లు పడగొట్టి.. దేవాలయాలు కూలగొట్టి.. మహాత్ముల విగ్రహాలను కూల్చిన […]

Written By: NARESH, Updated On : November 7, 2022 10:58 pm
Follow us on

Pawan Kalyan vs Jagan : జనసేనాని పవన్ కళ్యాన్ తో పెట్టుకొని ఇప్పుడు సీఎం జగన్ తొలిసారి తనను తానే కూల్చేసుకున్నాడు. జనసేన సభకు వ్యవసాయ భూములు ఇచ్చారనే కోపంతో ఇప్పటం గ్రామంలోని రైతుల ఇళ్లను కూలగొట్టి రోడ్డు వెడల్పు అంటూ వైసీపీ సర్కార్ దమనకాండకు దిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

అయితే ఇప్పటంలో ప్రజల ఇళ్లు పడగొట్టి.. దేవాలయాలు కూలగొట్టి.. మహాత్ముల విగ్రహాలను కూల్చిన అధికారులు కేవలం సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం కూల్చలేదు. చుట్టుపక్కల ఇళ్లు కూల్చిన అధికారులు మధ్యలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని వదిలేడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పక్షపాతంతోనే కుట్రపూరితంగానే చేశారని ప్రజల్లో ఫోకస్ అయ్యింది.

మీడియా ఎదురుగానే వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ కూల్చలేదని పవన్ కళ్యాణ్ వీరావేశంతో ప్రశ్నించారు. దీంతో ప్రజల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఇప్పటంలో కావాలనే కక్షతోనే ఈ రోడ్డు వెడల్పు పేరిట కూల్చారన్నది బయటపడింది.

పవన్ కళ్యాణ్ విమర్శలతో దెబ్బకు వైసీపీ ప్రభుత్వం దిగివచ్చింది. అధికారులు ఈరోజు ఆగమేఘాలపై వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని సైతం రోడ్డుపై నుంచి తరలించారు. ఇదంతా పవన్ ఘనత అని కొనియాడారు. వైసీపీ వాళ్ల చేతనే.. వైసీపీ వాళ్ల నాయకుడి విగ్రహాన్ని తొలగింపచేసిన ఘనత పవన్ సొంతమనే చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ దెబ్బకు ఇప్పుడు సొంత తండ్రి విగ్రహాన్ని తొలగించుకున్న అప్రతిష్ట జగన్ సొంతమైంది. ఆయనలో వింత పశ్చాత్తాపం వ్యక్తమవుతోంది. అనవసరంగా జనసేన జోలికి వెళ్లి సొంత తండ్రి.. వైసీపీ నాయకుడి విగ్రహాన్ని వాళ్లకు వాళ్లే తొలగించుకోవడం ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదు. దీన్ని బట్టి ఓడింది ఎవరూ.. గెలిచింది ఎవరు అంటే అది జనసేనాని పవన్ కళ్యాణే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇది ఆరంభం కావాలని.. నేడు వైఎస్ జగన్ తండ్రి విగ్రహం తొలగింపచేశామని.. రేపు ఆ కూల్చివేతల ఆపేస్తామని.. తర్వాత ప్రభుత్వం తొలగిస్తామంటూ జనసైనికులు దీన్ని ఒక విజయంగా అభివర్ణిస్తున్నాయి. జగన్ సర్కార్ పై ఇది జనసేనది తొలి విజయం అంటున్నారు.