Palvancha Case: ఉమ్మడి ఖమ్మం డిస్ట్రిక్ట్‌లోని పాల్వంచ తూర్పు బజార్‌లో భార్యా పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్న రామకృష్ణ కేసులో సంచలన విషయం బయటకు వచ్చింది. ఆత్మహత్యకు ముందర బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. సదరు వీడియోలో రామకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలిపాడు. తన ఆస్తి గొడవ తీరాలంటే తన భార్యను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు పంపించాలన్నాడని.. అందుకే ఆ ఆవేదనతో చనిపోతున్నట్టు వీడియోలో బాధితుడు వాపోయాడు. అనంతరం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడీ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది.

ఈ నెల 3న పాల్వంచలో రామకృష్ణ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు అన్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. వనమా రాఘవా దురాగతాలు అన్నీ ఇన్నీ కావని, రాఘవేంద్రరావు తీరుతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యానని రామకృష్ణ పేర్కొన్నాడు.
Also Read: అమిత్ షా లూప్ హోల్ పై కొట్టిన కేటీఆర్
తనతో పాటు తన భార్య పిల్లలను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రంగా కాలిన నేపథ్యంలో రామకృష్ణ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాను తన భార్య శ్రీ లక్ష్మితో ఎటువంటి విభేదాలు లేకుండా 12 ఏళ్లుగా కలిసి మెలిసి ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తను ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా భార్యను పంపాలని ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు అన్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
తన భార్యను ఎప్పుడు హైదరాబాద్‌కు తీసుకు వస్తే అప్పుడు తన సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించాడని వాపోయాడు రామకృష్ణ. అటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు. రాజకీయ, ఆర్థిక బలం, బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ అడిగారు. ఈ క్రమంలోనే రామకృష్ణ తనకు జరిగిన అన్యాయాల గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని రామకృష్ణ పేర్కొన్నాడు. ఎదుటి మనిషి బలహీనతలను గ్రహించి రాఘవేంద్రరావు తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ అన్నాడు.
ఇకపోతే పోలీసులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రరావుపై కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు తర్వాత రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకుగాను ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు పేర్కొనడం గమనార్హం.
వీడియో..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తున్న పేదరికం.. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ..
