Padma Awards 2022: ఆశ్చర్యపరిచిన మోడీ.. బిపిన్ కు పద్మ విభూషణ్.. సుందర్ పిచయ్, సత్యనాదెళ్లకు పద్మ భూషణ్

Padma Awards: మోడీ సర్కార్ ఈసారి ఆశ్చర్యపరిచింది. వివిధ రంగాల్లోని రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించింది.కళలు, సాహిత్యంలో సేవలు చేసిన వారితోపాటు రాజకీయంగా.. పారిశ్రామికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన దిగ్గజాలకు ఈ అవార్డులు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. పద్మ అవార్డులు – దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు అవార్డులను దేశంలో అత్యున్నత పురస్కారాలుగా […]

Written By: NARESH, Updated On : January 25, 2022 9:08 pm
Follow us on

Padma Awards: మోడీ సర్కార్ ఈసారి ఆశ్చర్యపరిచింది. వివిధ రంగాల్లోని రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించింది.కళలు, సాహిత్యంలో సేవలు చేసిన వారితోపాటు రాజకీయంగా.. పారిశ్రామికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన దిగ్గజాలకు ఈ అవార్డులు ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

పద్మ అవార్డులు – దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు అవార్డులను దేశంలో అత్యున్నత పురస్కారాలుగా భావిస్తారు. ఈ అవార్డులు వివిధ విభాగాలు/ కార్యకలాపాల రంగాలలో కృషి చేసిన వారికి ఇస్తారు. కళ, సామాజిక పని, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర
సేవ, మొదలైనవాటికి ఇస్తారు.

Gen-Bipin-Rawat_Sundar-Pichai_Satya-Nadella

‘పద్మ విభూషణ్’ అసాధారణమైన మరియు విశిష్టమైన సేవ చేసిన వారికి ప్రదానం చేయబడింది. హై ఆర్డర్ విశిష్ట సేవకు ‘పద్మభూషణ్’ మరియు ప్రముఖులకు ‘పద్మశ్రీ’
ఏదైనా రంగంలో సేవ చేసిన వారికి ఇస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి ఉత్సవ కార్యక్రమాలలో ప్రదానం చేస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో వీటిని ప్రధానం చేస్తారు.

ఈ సంవత్సరం 128 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దిగువ జాబితా ప్రకారం, 4 పద్మవిభూషణ్ అత్యున్నత పురస్కారాలున్నాయి. 17 పద్మ భూషణ్ మరియు 107 పద్మశ్రీ అవార్డులున్నాయి. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలున్నారు. జాబితాలో విదేశీయులు.. ఎన్నారైలున్నారు. ఈ వర్గం నుండి 10 మంది వ్యక్తులు ఉన్నారు. మరణానంతరం 13 మంది ఈ పురస్కారం అందుకుంటున్నారు.

హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ తోపాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా , కల్యాణ్ సింగ్ లకు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు.

ఇక కోవాగ్జిన్, కోవీషీల్డ్ తయారు చేసిన కృష్ణ ఎల్లా, సైరస్ పూనావాలాలకు ఈ అవార్డు అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తోపాటు ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు అయిన మన భారతీయలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించారు.

-పద్మ అవార్డుల లిస్ట్ ఇదే..

122017426-file