https://oktelugu.com/

TRS: తాడో పేడో తేలేనా.. టీఆర్ఎస్ వ్యూహం ఫలించేనా?

TRS: వరి ధాన్యం సేకరణ అంశంలో కేంద్రప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం ముగిసి.. ప్రస్తుతం ఆ యుద్ధం దేశరాజధాని ఢిల్లీ వరకు చేరింది. యాసంగి కొనుగోలు ధాన్యం పై స్పష్టతనివ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ సర్కారు వానాకాలం టార్గెట్ ఇంకాపూర్తి చేయలేదని కేంద్రం అంటోంది. ఈ క్రమంలోనే యాసంగికి సంబంధించి అప్పుడే కొనుగోలు గురించి చెప్తామని కేంద్రమంత్రి అంటున్నారు. అయితే, టీఆర్ఎస్ మాత్రం యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 22, 2021 / 04:17 PM IST
    Follow us on

    TRS: వరి ధాన్యం సేకరణ అంశంలో కేంద్రప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం ముగిసి.. ప్రస్తుతం ఆ యుద్ధం దేశరాజధాని ఢిల్లీ వరకు చేరింది. యాసంగి కొనుగోలు ధాన్యం పై స్పష్టతనివ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ సర్కారు వానాకాలం టార్గెట్ ఇంకాపూర్తి చేయలేదని కేంద్రం అంటోంది. ఈ క్రమంలోనే యాసంగికి సంబంధించి అప్పుడే కొనుగోలు గురించి చెప్తామని కేంద్రమంత్రి అంటున్నారు. అయితే, టీఆర్ఎస్ మాత్రం యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ హామీ ఇచ్చేదాకా ఢిల్లీని వీడబోమని పట్టుబట్టుకూ కూర్చొంది.

    Paddy Grain procurement

    ఈ క్రమంలోనే రెండు విడతలుగా టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై ఈ విషయాలపై చర్చించారు. అయితే, ఈ విషయమై రెండ్రోజుల్లో స్పష్టతనిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు అంటున్నారు. కాగా, కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ధాన్యం గోల తప్ప, మాకు అసలు వేరే పని ఉండదా అని తెలంగాణ మంత్రులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారని ఈ సందర్భంగా కేంద్రమంత్రి విమర్శించారు.

    మొత్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.కాగా, పింక్ పార్టీ నేతలు ఇలా వ్యవహరించడం ద్వారా తాడును తెగే దాకా లాగుతున్నారా? అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి తాను టీఆర్ఎస్ మంత్రులను రమ్మనలేదని, ఎప్పుడు వస్తే అప్పుడు తాను అప్పాయింట్ మెంట్ ఇవ్వాలా? అని ఓ వైపున ప్రశ్నిస్తున్నారు. మరో వైపున గులాబీ పార్టీ మంత్రులు మాత్రం లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇలా ఎంత దూరం వరకు ఈ వివాదం వెళ్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    Also Read: BJP vs TRS: కేసీఆర్ ప్లాన్ కు కౌంట‌ర్ వేస్తున్న కమలనాథులు..

    వరి ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తంగా రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయనే అభిప్రాయం కూడా జనంలో ఏర్పడుతోంది. అయితే, వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీని కార్నర్ చేయాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్‌ను కార్నర్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అధికార టీఆర్ఎస్ ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు వేసేందుకుగాను సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. కేసీఆర్ అవినీతిపై పోరాడాలని , తెలంగాణలో భారీ బియ్యం స్కాం జరిగిందని, త్వరలో వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. దాంతో ఇక తెలంగాణలో వరి ధాన్యం విషయంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే సీన్ క్రియేట్ అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. చూడాలి మరి.. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో..

    Also Read: KCR Chanakya strategy: కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..

    Tags